ప్రభుత్వ,ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఫైర్ సేఫ్టీ మెజర్స్‌పై మంత్రి దామోదర రాజ నర్సింహ సమీక్ష
సాక్షి లైఫ్ : మంత్రి దామోదర రాజ నర్సింహ శనివారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అదికారులను మంత్రి ఆదేశించారు.
ప్రభుత్వ దవాఖాన్లలో ఫైర్ సేఫ్టీపై తనిఖీలు చేసి, నివేదిక తయారు చేయాలని, తనిఖీల కోసం వెంటనే పది బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ బృందాలు తొలుత గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఎంజీఎం వంటి పెద్ద హాస్పిటళ్లలో తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి కోరారు.
ఇది కూడా చదవండి..డయాబిటిస్ రిస్క్ ఎలాంటివాళ్లకు ఎక్కువ..?
ఇది కూడా చదవండి..హెపటైటిస్ బి, సి ప్రాణాంతకమా..?
ఇది కూడా చదవండి..నూతన అధ్యయనం : పసుపులో విషపూరిత పదార్థాలు..
ఇది కూడా చదవండి..అవిసె గింజలతో ఎలాంటి దుష్ప్రభావాలున్నాయంటే..?
ఫైర్ అలార్మ్స్, స్మోక్ట్ డిటెక్టర్స్ ఉన్నదీ, లేనిది పరిశీలించా లన్నారు. మంటలను ఆర్పే యంత్రాలు సరిపడా ఉన్నాయో? లేవో చూడాలని, వాటి తుది గడువు తేదీలను చెక్ చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ, మంటలను ఆర్పే యంత్రాల వినియోగంపై హాస్పిటళ్లలో పనిచేసే సెక్యూరిటీ, ఇతర సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశించారు.
హాస్పిటళ్లలో పవర్ సప్లై సిస్టమ్‌ను పరిశీలించాలని, పాత ఎలక్ట్రిక్ కేబుల్స్ ఉంటే, వాటి స్థానంలో, నాణ్యమైన కొత్త కేబుల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఫైర్ సేఫ్టీ, షార్ట్ సర్క్యూట్‌కుసంబంధించి చేయాల్సినవి, చేయకూడనివి, సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. హాస్పిటల్‌కు సమీపంలోని ఫైర్ స్టేషన్ సిబ్బందితో హాస్పిటల్ అధికారులు టచ్‌లో ఉండాలని, హాస్పిటల్స్‌లో రెగ్యులర్‌గా ఫైర్ సేఫ్టీ మాక్‌డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించారు.
ప్రతి హాస్పిటల్‌కు ఫైర్ ప్లాన్ రూపొందించాలని, ఆ ప్లాన్‌పై డాక్టర్లు, స్టాఫ్‌కు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. ఫైర్ ప్లాన్‌కు సంబంధించిన సైన్ బోర్డులను హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేయాలని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని ఓ దవాఖానలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి పిల్లలు చనిపోయిన ఘటనపై ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజ నర్సింహ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు బాధాకరం అని అయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..ఎలాంటి వ్యాధుల నిర్మూలనకు త్రిఫల చూర్ణం పనిచేస్తుంది..?
ఇది కూడా చదవండి..కాలేయంలోని వ్యర్థాలను ఎలా తొలగించాలి..?
ఇది కూడా చదవండి..ఆటిజం థెరపీ ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉండగలుగుతారా..?
ఇది కూడా చదవండి..పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
