సాక్షి లైఫ్ : భారతదేశం, నేపాల్, పాకిస్తాన్‌లలో విక్రయించే పసుపు వివిధ నమూనాలలో అధిక స్థాయిలో సీసం ఉన్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ స్థాయిలు పరిమితి కంటే ఎక్కువగా ఉన్నాయి, ఒక్కో మోతాదుకు గ్రాముకు 1,000 మైక్రోగ్రాములు (ఎంజీ) మించిపోయాయి. భారతదేశ ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI) పసుపులో గరిష్టంగా అనుమతించదగిన సీసం కంటెంట్‌ను 10 ఎంజీ మాత్రమే.
సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్‌మెంట్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం, భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్‌లోని 23 నగరాల నుంచి పసుపును విశ్లేషించింది. సుమారు 14శాతం నమూనాల్లో 2 ఎంజీ సీసం సాంద్రతలను మించిపోయాయని వెల్లడించింది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు, ప్యూర్ ఎర్త్ అండ్ ఇండియాస్ ఫ్రీడమ్ ఎంప్లాయబిలిటీ అకాడమీ సహకారంతో పసుపుపై అధ్యయనం చేశారు. పసుపులో ఉన్న సీసం అనే లోహం కాల్షియంను అనుకరించడం, ఎముకలలో పేరుకుపోవడం ద్వారా అవసరమైన శారీరక విధులకు ఆటంకం కలిగిస్తుందని పేర్కొన్నారు.
భారతదేశంలోని పాట్నా, గౌహతి, చెన్నై, నేపాల్‌లోని ఖాట్మండు, పాకిస్తాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్,పెషావర్ మొత్తం ఏడు నగరాల నుంచి తీసుకున్న పసుపులో సీసం స్థాయిలు 10 ఎంజీ కంటే మించిపోయాయి. భారతదేశంలో, పాట్నా 2,274 ఎంజీ వద్ద అత్యధిక స్థాయిని నమోదు అయ్యింది. తర్వాత గౌహతి 127 ఎంజీ వద్ద ఉంది.