వైద్యసౌకర్యాల పనితీరుపై మంత్రి రాజనర్సింహ సమీక్ష 

షేర్ చేయండి:
వైద్యసౌకర్యాల పనితీరుపై మంత్రి రాజనర్సింహ సమీక్ష 

సాక్షి లైఫ్ : సెంట్రల్ మెడికల్ స్టోర్స్ ను బలోపేతం చేయడంపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను అడిగి పలు విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరంగా అందించే పలు సౌకర్యాల పనితీరును పరిశీలించారు. 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కృత్రిమ మందుల కొరత సమస్యను పరిష్కరించేందు కు, ఆయా జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశాలు ఇచ్చారు. సెంట్రల్ మెడికల్ స్టోర్స్ (సిఎంఎస్ )లో ఫార్మసీ సిబ్బందికి, మౌలిక సదుపాయాలు కల్పించడం, మందుల సరఫరా కోసం రవాణా వాహనాలు అందుబాటులో ఉంచడం వంటి చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ ప్రభుత్వ కార్యదర్శి డా. క్రిస్టినా చొంగ్తూ, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్వీ కర్ణన్, టీజీఎమ్ఎస్ఐడిసి ఎండీ హేమంత్ బోర్కడే, డిఎమ్ఈ డా. వాణీ, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా. అజయ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు డా. అమర్ సింగ్, శేష శ్రీతోపాటు అధికారులు, టాస్క్ ఫోర్స్ సభ్యులు పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి..బట్టతలకు చికిత్స చేయవచ్చా..?

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత మహిళల్లో వచ్చే వ్యాధులు ఇవే.. 

ఇది కూడా చదవండి..పోలియో నివారణకు ఏకైక మార్గం ఇదే..

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.