పోలియో నివారణకు ఏకైక మార్గం ఇదే..
సాక్షి లైఫ్ : పోలియో అనేది ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి. అందుకే ఈ రోజున పోలియో చుక్కల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంతోపాటు పోలియో నిర్మూలనకు ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రపంచ పోలియో దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 24న జరుపుకుంటారు.ప్రపంచ పోలియో దినోత్సవం చరిత్ర, పోలియో లక్షణాలు, నివారణ పద్ధతులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచ పోలియో దినోత్సవం 2024: పోలియో నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా పోలియోకు వ్యతిరేకంగా ప్రచారాలు నిర్వహిస్తారు.
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడే న్యాచురల్ ఫుడ్..?
ఇది కూడా చదవండి..డయాబెటిక్ న్యూరోపతిని ఎలా నిర్మూలించవచ్చు..?
ఇది కూడా చదవండి..డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?
ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు..
ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?
ప్రపంచ పోలియో దినోత్సవం చరిత్ర..
ప్రపంచ పోలియో దినోత్సవాన్ని రోటరీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రారంభించింది. ఈ రోజు జోనాస్ సాల్క్ పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటారు. పోలియో వ్యాక్సిన్‌ను కనుగొన్న మొదటి బృందానికి జోనాస్ సాల్క్ నాయకత్వం వహించారు. 1988లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచంలోని అన్ని దేశాలలో పోలియోను నిర్మూలించేందుకు ఒక మిషన్‌ను ప్రారంభించింది. ఈ మిషన్ ద్వారా, ఈ వ్యాధి నుంచి చిన్నారులను రక్షించడానికి వ్యాక్సిన్ ఇవ్వడంపై దృష్టి పెట్టారు. ప్రపంచ పోలియో దినోత్సవం ఈ కార్యక్రమంలో భాగమే.
పోలియో ఒక ప్రమాదకరమైన వ్యాధి. ఇది వస్తే పక్షవాతం వస్తుంది. ఇది ఎక్కువగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సంభవిస్తుంది. కాబట్టి పిల్లలకు అన్ని టీకాలు సకాలంలో తప్పనిసరిగా అందించాలి. 2014లో భారతదేశం పోలియో రహిత దేశంగా అవతరించింది.
నివారణ పద్ధతి ..?
పోలియో నివారణకు ఏకైక మార్గం పోలియో టీకా. భారతదేశంలో ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇస్తారు. 5 సంవత్సరాల లోపు ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేస్తారు.
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు..
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
