New COVID Variant 'BA 3.2' : కోవిడ్ కొత్త వేరియంట్ 'BA 3.2' కలకలం : వ్యాక్సిన్లు పనిచేస్తాయా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మరోసారి తన రూపాన్ని మార్చుకుంటూ శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా వెలుగుచూసిన 'BA 3.2' అనే కొత్త ఒమిక్రాన్ ఉప-వేరియంట్ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ కొత్త వేరియంట్‌లో ఏకంగా 70కి పైగా మ్యుటేషన్లు ఉండటమే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లకు ఆధారమైన 'JN.1' వేరియంట్‌తో పోలిస్తే.. ఈ కొత్త BA 3.2 వేరియంట్ స్పైక్ ప్రోటీన్‌లో సుమారు 70 నుంచి 75 మ్యుటేషన్లు, మార్పులు జరిగినట్లు పరిశోధకులు గుర్తించారు.

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

రోగనిరోధక శక్తిని తప్పించుకోగలదా..?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లకు ఆధారమైన 'JN.1' వేరియంట్‌తో పోలిస్తే.. ఈ కొత్త BA 3.2 వేరియంట్ స్పైక్ ప్రోటీన్‌లో సుమారు 70 నుంచి 75 మ్యుటేషన్లు, మార్పులు జరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. దీనివల్ల, గతంలో కరోనా బారిన పడటం ద్వారా లేదా వ్యాక్సిన్ల ద్వారా శరీరంలో వృద్ధి చెందిన రోగనిరోధక శక్తిని (Immunity) ఇది పాక్షికంగా తప్పించుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, మునుపటి వేరియంట్ల కంటే ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందనడానికి ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లభించలేదు.

అంతర్జాతీయంగా విస్తరణ.. కానీ భారత్‌లో లేదు..!

నవంబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య కాలంలో డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్స్ వంటి ఐరోపా దేశాలలో నమోదైన కేసుల్లో దాదాపు 30 శాతం ఈ వేరియంట్‌కు చెందినవే కావడం గమనార్హం. అలాగే, అమెరికాలోని 25 రాష్ట్రాలలో అంతర్జాతీయ ప్రయాణికుల పరీక్షలు, మురుగునీటి (Wastewater) నిఘా ద్వారా దీని ఉనికిని గుర్తించారు. శాస్త్రవేత్తలు దీని తదుపరి ఉప-రూపాలైన BA 3.2.1, BA 3.2.2 లపై కూడా నిరంతరం నిఘా ఉంచారు. కొత్త వేరియంట్ల వ్యాప్తిని గుర్తించడంలో జెనోమిక్ సీక్వెన్సింగ్, మురుగునీటి పర్యవేక్షణ వంటి నిఘా వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతానికి ఈ వేరియంట్ పట్ల అప్రమత్తత అవసరమే కానీ, భయపడాల్సిన పనిలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న నిఘా.. కడపలో ఇద్దరు మృతి..

భారతదేశంలో ఈ కొత్త BA 3.2 వేరియంట్ కేసులు ఇప్పటివరకు ఎక్కడా నమోదు కాలేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నమోదైన కోవిడ్ కేసులు, మరణాల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.

కడపలో కరోనా కేసుల కలకలం..  

వైఎస్ఆర్ కడప జిల్లాలో తాజాగా ఇద్దరు కోవిడ్ ఇన్ఫెక్షన్‌తో మరణించగా, మరో ఎనిమిది యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కడప వైరాలజీ ల్యాబ్‌లో నిర్వహించిన ఆర్టీ పీసీఆర్ (RT PCR) పరీక్షల్లో వేర్వేరు ప్రాంతాలకు చెందిన నలుగురికి పాజిటివ్‌గా తేలింది.

వ్యాక్సినేషన్ తీసుకున్నా..

పాజిటివ్ వచ్చిన వారిలో అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోగా, ఒకరు బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారు. వీరిలో ముగ్గురు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా, స్వల్ప లక్షణాలు ఉన్న మరొకరిని కడపలోని స్థానిక ఆసుపత్రి ప్రత్యేక కోవిడ్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

మరణాలకు కారణాలేంటి..?

మరణించిన ఇద్దరిలో ఒకరు (60) గత జూన్ 28న వెల్లూరు సీఎంసీలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు మధుమేహం, కిడ్నీ వ్యాధులతో పాటు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మరో కేసులో 43 ఏళ్ల వ్యక్తి ఇన్ఫెక్షన్ తీవ్రతతో ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ఇన్ఫెక్షన్లకు ఒమిక్రాన్ వేరియంట్ కారణం కావచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

నివారణ చర్యలు ముమ్మరం.. 

ప్రభావిత ప్రాంతాల నుంచి అధికారులు 40 మంది నమూనాలను సేకరించగా, అందులో 10 మందికి నెగటివ్ అని తేలింది. మిగిలిన నివేదికలు రావాల్సి ఉంది. ఇన్ఫెక్షన్ మరింత వ్యాప్తి చెందకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, కోవిడ్ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..  మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.