Nipah Virus Alarms Asia: ఆసియాను వణికిస్తున్న నిఫా వైరస్.. మరణాల రేటు 75 శాతం వరకు ఉండే అవకాశం : డబ్ల్యూహెచ్ఓ
సాక్షి లైఫ్ : పశ్చిమ బెంగాల్‌లో వెలుగుచూసిన ప్రాణాంతక 'నిఫా' వైరస్ ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ నెలలో బెంగాల్‌లో ఇద్దరు వ్యక్తులు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో పొరుగున ఉన్న ఆసియా దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ వైరస్ సోకిన వారిలో మరణాల రేటు 40 నుంచి 75 శాతం వరకు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించడంతో థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్ వంటి దేశాలు అత్యంత అప్రమత్తమయ్యాయి.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి.. లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
విమానాశ్రయాల్లో నిఘా..
భారత్ నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పలు దేశాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. థాయ్‌లాండ్, మలేషియా తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రయాణికులు తమ ఆరోగ్య పరిస్థితిపై ముందస్తు సమాచారం అందించాలని సింగపూర్ స్పష్టం చేసింది. లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే ఐసోలేషన్‌కు తరలించేలా ప్రత్యేక వార్డులను సిద్ధం చేశారు.
నిఫా వైరస్‌కు ప్రస్తుతం నిర్దిష్టమైన వ్యాక్సిన్ గానీ, చికిత్స గానీ అందుబాటులో లేదు. ఈ వైరస్ కేవలం గబ్బిలాలు, పందుల నుంచి మనుషులకే కాకుండా, మనిషి నుంచి మనిషికి కూడా వేగంగా వ్యాపిస్తుంది.
లక్షణాలు..?
తీవ్రమైన జ్వరం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఫిట్స్ రావడం, మెదడు వాపు (Encephalitis) దీని ప్రధాన లక్షణాలు. గబ్బిలాలు కొరికిన పండ్లను తినకూడదని, జంతువులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. విదేశీ ప్రయాణాలు చేసే వారు, అలాగే ప్రభావిత ప్రాంతాల్లో ఉండేవారు మాస్కులు ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని నిపుణులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..!
ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
