సరోజినీ దేవి ఐ హాస్పిటల్ లో 'ఓసీటీ' సేవలు పునరుద్ధరణ..!

షేర్ చేయండి:
సరోజినీ దేవి ఐ హాస్పిటల్ లో 'ఓసీటీ' సేవలు పునరుద్ధరణ..!

సాక్షి లైఫ్ : ప్రభుత్వ రంగంలో అత్యుత్తమ నేత్ర వైద్య సేవలు అందించే సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి మరో అత్యాధునిక పరికరం అందుబాటులోకి వచ్చింది. దాదాపు రెండేళ్లుగా నిలిచిపోయిన ఓసీటీ (Optical Coherence Tomography) నిర్ధారణ సేవలు తాజాగా పునరుద్ధరించారు. రూ.1 కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ నూతన యంత్రం ద్వారా రెటీనా సంబంధిత వ్యాధులను మరింత నిశితంగా పరిశీలించే అవకాశం కలిగింది.

 

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

నిర్ధారణ సులభం.. చికిత్స వేగవంతం.. 

కంటి లోపలి పొరలను, ముఖ్యంగా రెటీనా నిర్మాణాన్ని అత్యంత స్పష్టంగా ఛాయాచిత్రాల రూపంలో చూపేందుకు ఈ ఓసీటీ యంత్రం దోహదపడుతుంది. దీని ప్రత్యేకతలు ఇవే గ్లాకోమా, కార్నియా సమస్యలు, రెటీనా దెబ్బతినడం వంటి 50కి పైగా వివిధ రకాల కంటి పరీక్షలను దీని ద్వారా నిర్వహించవచ్చు.

డయాబెటిక్ రెటినోపతి.. 

మధుమేహం వల్ల కంటి చూపు దెబ్బతినే ముప్పున్న వారికి ఈ పరీక్ష సంజీవనిలా మారుతుంది. ముందస్తుగానే వ్యాధి తీవ్రతను గుర్తించి అంధత్వాన్ని నివారించవచ్చు. పరీక్ష చేసిన ఐదు నిమిషాల్లోనే రిపోర్టులు అందుబాటులోకి వస్తాయి. వీటిని వైద్యులు ఆన్‌లైన్‌లో కూడా సమీక్షించే వీలుంది.

రోగులకు తప్పిన తిప్పలు.. 

గతంలో పాత యంత్రం పని చేయకపోవడం వల్ల రోగులు స్కానింగ్ కోసం ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయించాల్సి వచ్చేది. ప్రతిరోజూ సుమారు 25 మందికి పైగా రోగులను ఇతర ఆసుపత్రులకు రెఫర్ చేసేవారు. ఇప్పుడు ఆసుపత్రిలోనే ఈ సదుపాయం కలగడం వల్ల పేద రోగులకు ఆర్థిక భారంతో పాటు సమయం కూడా ఆదా కానుంది.తెలుగు రాష్ట్రాల్లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ముగ్గురిలో ఒకరు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. 

ఓసీటీ యంత్రం ద్వారా వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి మెరుగైన వైద్యం అందించవచ్చుని సరోజినీ దేవి ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. పి. మోదినీ పంధర్‌పూర్కర్ చెబుతున్నారు. ఆసుపత్రిలో ఈ స్కానింగ్ సేవలు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు వైద్యుల సలహా మేరకు ఈ సేవలను వినియోగించుకోవచ్చు.

 

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?

ఇది కూడా చదవండి.. పిల్లలలో థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ ఎలాంటి వారికి వస్తుంది..?

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.