పోస్టుమార్టం నివేదిక : హత్యాచారానికి గురైన ట్రెయినీ డాక్టర్ కేసులో కీలక వివరాలు..
సాక్షి లైఫ్ : కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో దారుణ హత్యాచారానికి గురైన ట్రెయినీ డాక్టర్ కేసులో కీలక వివరాలు వెలుగులోకివచ్చాయి. తాజాగా పోస్టుమార్టం నివేదిక ద్వారా ఆయా వివరాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం, డాక్టర్ మరణానికి కారణం ఊపిరి ఆడకపోవడమేనని చెబుతున్నారు. ఆమె గొంతు నులమడం వల్ల మరణించిందని నివేదికలో పేర్కొన్నారు. పలు జాతీయ మీడియా కథనాల్లో సైతం ఆర్జీ కర్ ట్రెయినీ డాక్టర్ ఊపిరి ఆడకపోవడం వల్లే చనిపోయిందని అంటున్నారు.
ఇది కూడా చదవండి..ఈ ఐదు చిట్కాలు పాటిస్తే ఎలాంటి రోగాలు రావు..
ఇది కూడా చదవండి..మెంతులతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయా..?
ఇది కూడా చదవండి..ఏ ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఏలకులలో ఎన్ని అద్భుత ఔషధగుణాలున్నాయో తెలుసా..?
బాధితురాలిపై అత్యాచారం జరిగిందనే ఆరోపణలు ఉన్నా, మృతురాలి శరీరంపై 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఇది నిజం కాదని నివేదికలో వెల్లడైంది. అయితే శరీరంపై తెల్లటి, చిక్కటి ద్రవంలా ఉందని, అది మాత్రం వీర్యం కాదని స్పష్టం చేసింది పోస్టుమార్టం నివేదిక. అయితే, ఆ ద్రవం ఏమిటి..?అనేది నివేదికలో స్పష్టం చేయలేదు. అలాగేమృతురాలి ఎముకలు విరిగినట్లు వచ్చిన ఆరోపణలను కూడా నివేదిక తిరస్కరించింది. ఎముకలు విరిగిన ఆనవాళ్లు లేవని క్లారిటీ ఇచ్చింది.
ఇది కూడా చదవండి..ఏ ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
