ఏలకులలో ఎన్ని అద్భుత ఔషధగుణాలున్నాయో తెలుసా..? 

షేర్ చేయండి:
ఏలకులలో ఎన్ని అద్భుత ఔషధగుణాలున్నాయో తెలుసా..? 

సాక్షి లైఫ్ : ఏలకులు దాదాపు ప్రతి వంటగదిలో కనిపించే సుగంధ ద్రవ్యాలలో ప్రధానమైనవి. ఇవి మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగపడుతాయి. ఏలకులు అనేక తీపి వంటకాలలో విస్తృతంగా వినియోగిస్తారు. చూడడానికి చాలా చిన్నగా కనిపించే ఈ ఏలకులు తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చొ మీకు తెలుసా..? వీటిని తినడం వల్ల స్త్రీలు, పురుషులు ఇద్దరికీ అనేక ప్రయోజనాలున్నాయి. అవేంటంటే..? 

ఇది కూడా చదవండి.. సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఏలకులు-ప్రయోజనాలు..  

ఏలకులలో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, డైటరీ ఫైబర్ వంటి అనేక పోషకాలు లభిస్తాయి. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటే లేదా ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బందిగా ఉంటే, ఏలకులు తినడంవల్ల ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. ఇందులో ఉండే ఔషధ గుణాలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి పని చేస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాదు పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాదు ఏలకులు తినడం వల్ల మలబద్ధకం కూడా నయమవుతుంది.

 మౌత్ ఫ్రెషనర్‌.. 

చాలామంది ఏలకులను మౌత్ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగిస్తారు.  నోటి దుర్వాసనకు ఏలకులు సరైన పరిష్కారం. ఇవి తినడం ద్వారా నోటి దుర్వాసన తొలగిపోతుంది. నోరు తాజాగా మారుతుంది. ధూమపానం, మద్యం సేవించిన తర్వాత కూడా చాలా మంది ఏలకులు తీసుకుంటారు. నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.

గొంతు నొప్పి నుంచి ఉపశమనం.. 

గొంతు నొప్పి ఉన్నపుడు ఏలకులు చాలాబాగా పనిచేస్తాయి. ఇవి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు గొంతు సమస్యల నుంచి ఉపశనం పొందడానికి, ఏలకులను టీతో తీసుకుంటే వెంటనే పరిష్కారం లభిస్తుంది.  

ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..? 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

  ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.