Rising Heart Disease Among Youth: యువతను కబళిస్తున్న గుండె జబ్బులు.. మారుతున్న జీవనశైలే ప్రధాన కారణమా..?
సాక్షి లైఫ్ : గుండె జబ్బులు గతంలో ఒక యాభై ఏళ్ల వయస్సు దాటినవారికే వచ్చేవి.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. యువతలోనే ఈ గుండె సమస్యలు మరింతగా పెరగడమేకాకుండా వారి ప్రాణాలను హరిస్తున్నాయి. తెలంగాణలో నమోదవుతున్న మరణాల్లో ఎక్కువ శాతం గుండె సంబంధిత వ్యాధులవేనని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారు, చూడటానికి ఎంతో ఆరోగ్యంగా కనిపించే నిపుణులు సైతం అకస్మాత్తుగా ఆసుపత్రుల పాలవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
నివేదిక ఏం చెబుతోంది..?
మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ (MCCD) - 2023 నివేదిక ప్రకారం తెలంగాణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం వైద్య ధ్రువీకృత మరణాలలో 42 శాతం కేవలం గుండె సంబంధిత వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, వైద్య కారణాల ద్వారా మరణాలను ధ్రువీకరించడంలో తెలంగాణ జాతీయ స్థాయిలో 4వ స్థానంలో ఉంది. శ్వాసకోశ వ్యాధులు (7.2%), క్యాన్సర్లు (3.3%) వంటి వాటికంటే హృద్రోగాలే అత్యంత ప్రమాదకరంగా మారాయి.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ముప్పు పెరగడానికి కారణాలివే..
ఆధునిక జీవనశైలిలో చోటు చేసుకున్న మార్పులే యువ హృదయాలను బలహీనపరుస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గంటల తరబడి కూర్చుని పనిచేయడం..శారీరక శ్రమ లేకపోవడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతోంది.
ఆహారపు అలవాట్లు.. జంక్ ఫుడ్, అధిక ఉప్పు, నూనె పదార్థాల వాడకం..
నిద్రలేమి, ఒత్తిడి.. పని ఒత్తిడి వల్ల తగినంత నిద్ర లేకపోవడం గుండెపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రక్తపోటు (Hypertension), మధుమేహం (Diabetes) వంటి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించకపోవడం.
ఇవి తప్పనిసరి..
గుండె జబ్బులు ఇప్పుడు కేవలం వయసు పైబడిన వారి సమస్య కాదు. వ్యాయామం, సరైన ఆహారం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారానే ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. 30 ఏళ్లు దాటిన వారు ఏటా కనీసం ఒక్కసారైనా హెల్త్ చెకప్ చేయించుకోవాలి.ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నడక లేదా వ్యాయామం తప్పనిసరి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను తక్షణమే మానెయ్యాలి.
ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
