Rising Heat in India : పెరుగుతున్న వేడితో ఏటా నిద్ర కోల్పోతూ తీవ్రమైన అనారోగ్యసమస్యల బారిన పడుతున్న జనాలు.. తాజా నివేదిక.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న ఉష్ణో గ్రతలు, రాత్రిపూట ఉక్కబోత మన నిద్రను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. క్లైమేట్ సెంట్రల్ తాజా నివేదిక ప్రకారం, మహా నగరాల్లో ప్రజలు ఏటా పదుల గంటల నిద్రను కోల్పోతూ తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. పగటిపూట మాత్రమే కాకుండా రాత్రిళ్లు కూడా వేడి, ఉక్కబోత పెరిగిపోవడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతు న్నారు. నిద్రలో పదేపదే మెలకువ రావడం, చెమటలు పట్టడం వల్ల ప్రశాంతమైన నిద్ర కరువవుతోంది. గత 50 ఏళ్లలో అంటే 1970ల నాటితో పోలిస్తే వాతావరణ మార్పుల వల్ల నిద్రలేమి సమస్య దాదాపు రెట్టింపు అయిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2020-2025 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి సగటున 56 గంటల నిద్రను వదులుకోవాల్సి వచ్చింది.

 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

ఏ నగరంలో ఎన్ని గంటల నిద్ర కోల్పోతున్నారంటే..? 

ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఏడాదికి సగటున 2920 నుంచి 3000 గంటల నిద్ర అవసరం. కానీ, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల దక్షిణాదితో పాటు పలు ప్రధాన నగరాల్లో ప్రజలు భారీగా నిద్రను కోల్పోతున్నారు.వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉక్కబోత రాత్రుల కారణంగా వివిధ నగరాలు, రాష్ట్రాల్లో ప్రజలు ఏటా సగటున భారీగా నిద్రను కోల్పోతున్నారు. ఈ జాబితాలో చెన్నై అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. ఇక్కడి ప్రజలు ఏడాదికి సగటున అత్యధికంగా 93 గంటల నిద్రను కోల్పోతుండగా, పుదుచ్చేరి వాసులు 92 గంటల నిద్రకు దూరమవుతున్నారు. ఆ తర్వాత స్థానాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లోని ప్రజలు వరుసగా 88.6 గంటలు, 88.3 గంటల నిద్రను కోల్పోతున్నారు. 

ఇక ఇతర ప్రధాన నగరాలైన ముంబైలో 84 గంటలు, కోల్‌కతాలో 80 గంటల చొప్పున ప్రజలు తమ నిద్రను కోల్పోవాల్సి వస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది; ఇక్కడి ప్రజలు ఏడాదికి సగటున 66 గంటల మేర నిద్రను కోల్పోతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

పొంచి ఉన్న ఆరోగ్య ముప్పు..

తగినంత నిద్ర లేకపోవడం వల్ల కేవలం అలసట, పగటిపూట నిద్రమత్తు మాత్రమే కాకుండా దీర్ఘకాలంలో ప్రాణాంతక వ్యాధుల ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి పూట వాతావరణం చల్లబడకపోవడం వల్ల శరీరం విశ్రాంతి దశకు చేరుకోదు. ఫలితంగా రక్తపోటు (bp) పెరిగి, గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

నిద్రలేమి వల్ల మెటబాలిజం (metabolism) దెబ్బతిని..

నిద్రలేమి వల్ల మెటబాలిజం (metabolism) దెబ్బతిని మధుమేహం, ఊబకాయం బారిన పడే అవకాశాలు ఎక్కువవుతాయి. నిరంతర నిద్రలేమి పనిపై ఏకాగ్ర తను దెబ్బతీసి, క్రమంగా మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌కు దారి తీస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి, శరీర కణాలు దెబ్బతినడం వల్ల దీర్ఘకా లంలో క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు కూడా పెరిగే ప్రమాదం ఉంది. విపరీతంగా పెరుగుతున్న పట్టణీకరణ, కాంక్రీట్ నిర్మాణాలు, గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలే ఈ ఉక్కపోత రాత్రులకు ప్రధాన కారణం. వీటికి అడ్డుకట్ట వేసి పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే రాబోయే రోజుల్లో రాత్రి వేడి మరింత పెరిగి, మన ఆరోగ్యం, ఆయుష్షుపై పూడ్చలేని నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.