QDENGA - TAK-003 : డెంగ్యూ రక్కసికి చెక్ పెట్టేందుకు.. దేశంలో తొలి వ్యాక్సిన్‌కు డీసీజీఐ ఆమోదం..!
సాక్షి లైఫ్ : భారత్‌లో డెంగ్యూ మహమ్మారి నిర్మూలన దిశగా ఒక కీలక మైలురాయి నమోదైంది. దేశంలోనే మొట్టమొదటి డెంగ్యూ నివారణ వ్యాక్సిన్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) మార్కెట్ అనుమతులు మంజూరు చేసింది. ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా సంస్థ 'టకెడా బయోఫార్మాస్యూటికల్స్' రూపొందించిన 'క్యూడెంగా' (QDENGA - TAK-003) వ్యాక్సిన్‌కు ఈ ఆమోదం లభించినట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
4 నుంచి 60 ఏళ్ల వారికి..
ఈ సరికొత్త వ్యాక్సిన్‌ను 4 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సు గల వారికి అందించేందుకు నిపుణుల కమిటీ అనుమతించింది. ప్రతి ఏటా వర్షాకాలంలో వేలాది మందిని ఆసుపత్రుల పాలు చేస్తూ, ప్రాణాంతకంగా మారుతున్న డెంగ్యూ జ్వరం బారిన పడకుండా ముందస్తు రక్షణ కల్పించడంలో ఈ టీకా ఎంతో కీలకం కానుంది.
నాలుగు రకాల వైరస్‌లపై సమర్థవంతంగా..
'క్యూడెంగా' అనేది ఒక 'లైవ్-అటెన్యుయేటెడ్ టెట్రావాలెంట్' (Live-attenuated tetravalent) వ్యాక్సిన్. డెంగ్యూ వ్యాధికి కారణమయ్యే నాలుగు రకాల ప్రధాన వైరస్ సీరోటైప్‌ల (Serotypes) పై ఇది సమర్థవంతంగా పోరాడుతుందని, శరీరంలో బలమైన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని క్లినికల్ ట్రయల్స్ లో నిరూపితమైంది.
వ్యాక్సిన్ ప్రత్యేకతలు, డోసేజ్ విధానం..
ముందస్తు పరీక్షలు అవసరం లేదు: సాధారణంగా డెంగ్యూ వ్యాక్సిన్ ఇచ్చే ముందు సదరు వ్యక్తికి గతంలో డెంగ్యూ సోకిందా లేదా అని తెలుసుకోవడానికి స్క్రీనింగ్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కానీ, ఈ 'క్యూడెంగా' టీకా తీసుకునేందుకు ఎలాంటి ముందస్తు డెంగ్యూ పరీక్షలు అవసరం లేదని సంస్థ స్పష్టం చేసింది.
రెండు డోసుల విధానం..
ఈ వ్యాక్సిన్‌ను రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోస్ తీసుకున్న మూడు నెలల వ్యవధి తర్వాత రెండో డోస్ వేయించుకోవాల్సి ఉంటుంది. దేశంలో డెంగ్యూ కేసుల తీవ్రతను తగ్గించడానికి, తద్వారా ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్యను అదుపు చేయడానికి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం దేశ ఆరోగ్య రంగంలో ఒక పెద్ద ఊరటగా నిలవనుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
