ఆర్‌ఎస్‌వీ వైరస్ కలకలం: ఐసీయూల్లో చిన్నారులు..!

షేర్ చేయండి:
ఆర్‌ఎస్‌వీ వైరస్ కలకలం: ఐసీయూల్లో చిన్నారులు..!

సాక్షి లైఫ్ : మహారాష్ట్రలోని పుణెలో వర్షాకాలం ప్రారంభం కాగానే ఆర్ఎస్‌వీ (రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్) వైరస్ కేసులు అనూహ్యంగా పెరగడంపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది  వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని, పెద్ద సంఖ్యలో చిన్నారులు, ముఖ్యంగా శిశువులు, ఐసీయూల్లో చేరి వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు.

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి.. లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య పెరిగిందని, ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. 2010-2011లో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించాయని వారు చెబుతున్నారు.ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆర్ఎస్‌వీ వైరస్ లక్షణాలలో జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు దిబ్బడ వంటివి ఉంటాయి.

జాగ్రత్త అవసరం: పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని శిశు వైద్య నిపుణులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జలుబు, దగ్గును నిర్లక్ష్యం చేయవద్దు: సాధారణ జలుబు, దగ్గుగా భావించి నిర్లక్ష్యం చేయకుండా, వాటిని తీవ్రమైన వైరస్ కారణం కావచ్చు అని గుర్తుంచుకోవాలి.ఆర్‌ఎస్‌వీ సాధారణంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న శిశువులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కానీ ఈసారి ఆరోగ్యంగా ఉన్న పిల్లలు కూడా తీవ్రంగా అనారోగ్యానికి గురవుతున్నారు. అంతేకాకుండా, 3-6 ఏళ్ల వయసున్న పిల్లల్లో కూడా ఈ వైరస్ ప్రభావం కనిపిస్తోంది. ఈ వైరస్‌కు ప్రత్యేకంగా చికిత్స లేదని, చిన్నారులకు ఆక్సిజన్, ఇతర సపోర్టివ్ కేర్ మాత్రమే అందిస్తున్నామని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొంతమంది పిల్లలకు మళ్లీ మళ్లీ వైరస్ సోకుతోందని వారు తెలిపారు.

ఈ వైరస్ నుంచి రక్షించడానికి "Nirsevimab" అనే ఖరీదైన ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే, అది అందరికీ అందుబాటులో లేని ధరలో ఉందని డాక్టర్లు వివరించారు. ఈ సీజన్‌లో ఆర్‌ఎస్‌వీ కేసులు పెరగడంతో తల్లిదండ్రులలో ఆందోళన నెలకొంది.

ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.