క్యాన్సర్ రోగులకు ఉపశమనం.. వ్యాక్సిన్‌ను తయారు చేసిన రష్యా.. 

షేర్ చేయండి:
క్యాన్సర్ రోగులకు ఉపశమనం.. వ్యాక్సిన్‌ను తయారు చేసిన రష్యా.. 

సాక్షి లైఫ్ : ప్రస్తుతం ప్రపంచం మొత్తం క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులతో అల్లాడిపోతోంది. ఖరీదైన క్యాన్సర్ చికిత్స , వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది చనిపోతు న్నారు. ఈ వ్యాధిని నిర్మూలించడానికి రష్యా ముందుకు వచ్చింది. అందులో భాగంగానే రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్‌ను తయారు చేసింది, ఈ వ్యాక్సిన్ ను ఉచితంగా అందుబాటులోకి తెస్తామని రష్యా ప్రకటించింది. 

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..  చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

రష్యాకు చెందిన ఈ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను వివిధ రకాల రోగులకు వేర్వేరుగా తయారు చేయనున్నట్లు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఆండ్రీ కప్రిన్ తెలిపారు.దీని ధర దాదాపు రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. రష్యన్ పౌరులు ఈ టీకాను ఉచితంగా పొందవచ్చని వెల్లడించారు.

అయితే, ఈ వ్యాక్సిన్ ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దాని గురించి కప్రిన్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. క్యాన్సర్ వ్యాక్సిన్ 2025లో విడుదల కానుందని పరిశోధకులు చెబుతున్నారు. రష్యాలోని క్యాన్సర్ రోగులకు 2025 ప్రారంభం నుంచి ఉచితంగా అందించే ఈ వ్యాక్సిన్‌ను రూపొందించినట్లు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.