ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?  

షేర్ చేయండి:
ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?  

సాక్షి లైఫ్ : ఏడిస్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ వస్తుంది. దోమ కుట్టిన కొద్ది రోజులకే దీని లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతుంది. డెంగ్యూ విషయంలో, రోగికి అధిక జ్వరం ఉంటుంది. అంతేకాకుండా ఈ వ్యాధి బారిన పడినవారిలో పలురకాల లక్షణాలు కనిపిస్తాయి. అటువంటి వాటిలో ఏమేం ఉంటాయంటే..? 

థ్రోంబోసైటోపెనియా సమస్య..  

ప్లేట్‌లెట్లు తక్కువగా ఉండడాన్ని" థ్రోంబోసైటోపెనియా" అని పిలుస్తారు.  ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి, ఈ సమస్య ఉన్నప్పుడు రోగికి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. అయితే, డెంగ్యూ తీవ్రంగా మారినప్పుడు మూడు లేదా నాలుగో రోజున ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది రెండు మూడు రోజుల పాటు కొనసాగుతుంది. కానీ అది ఎనిమిదవ, తొమ్మిదవ రోజు మెరుగుపడటం ప్రారంభమవుతుంది. ఈ లోపు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుంది. 

ఇది కూడా చదవండి..గర్భం దాల్చిన మొదటి మూడునెలలు ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ ఎందుకు వస్తుందో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఏ వయసువారిలో రక్తహీనత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి..? 

 

- తీవ్రమైన తలనొప్పి

- కండరాలు,కీళ్ల నొప్పి

- అలసట, బలహీనత

- శరీరంపై దద్దుర్లు

ఇవి తీవ్రమైన లక్షణాలు

– ముక్కు, చిగుళ్ల నుంచి రక్తస్రావం

- కడుపులో తీవ్రమైన నొప్పి

- వాంతి అయినపుడు రక్తం పడడం

- మూత్రంలో నల్ల మలం లేదా రక్తం

 చర్మంపై చిన్న ఎరుపు లేదా గోధుమ రంగు మచ్చలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

 

ఇది కూడా చదవండి..చర్మ సంబంధిత సమస్యలు ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తాయి..?

ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..

ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.