త్వరలో అందుబాటులోకి రానున్న టీబీ వ్యాక్సిన్స్ .. 

షేర్ చేయండి:
త్వరలో అందుబాటులోకి రానున్న టీబీ వ్యాక్సిన్స్ .. 

సాక్షి లైఫ్ : టిబికి సమర్థవంతమైన చికిత్స ఉన్నప్పటికీ ,నేటికీ  చాలా మంది దీని బారీన పడి మరణిస్తున్నారు. 100 ఏళ్ల  నుంచి బాసిల్లస్ కాల్మెట్ గెరిన్ (బీసీజీ) టీకా పిల్లలు, యుక్తవయసులో క్షయవ్యాధిని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తూ  ఉంది. ఈ క్షయవ్యాధిని నయం చేయడానికి కొన్ని ఔషధాలున్నప్పటికీ , శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ తయారీపై దృష్టి సారించారు.  
 
టీబీపై పోరాడేందుకు 11 వ్యాక్సిన్స్ తయారుచేయడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.8 బిలియన్ల మంది క్షయవ్యాధితో బాధపడుతున్నారు. ప్రపంచంలోని వివిధ వ్యాధుల మరణాలకు ప్రధాన కారణాలలో ఇది కూడా ఒకటి.
 

ఇది కూడా చదవండి.. క్ష‌యవ్యాధి అంటే ఏమిటి..? నివారణ ఎలా..? 


 బాసిల్లస్ కాల్మెట్ గెరిన్ టీకా క్షయవ్యాధి నుంచి  రక్షించడంలో సహాయపడుతుంది. టీకా టీబీకి కారణమయ్యే బ్యాక్టీరియాతో సంక్రమణను నిరోధించదు, కానీ ఇది వ్యాధి అభివృద్ధిని నిరోధిస్తుంది. ఈ టీకా చిన్న పిల్లలలో తీవ్రమైన టిబిని నివారించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

టీబీ నిర్మూలనకు11 వ్యాక్సిన్‌లపై ప్రయోగాలు జరుగుతున్నట్లు డేటా అండ్ అనలిటిక్స్ కంపెనీ గ్లోబల్‌డేటా నివేదిక వెల్లడించింది. వీటిలో, ఒక టీకాను గమలేయ ఫెడరల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసింది. మరొకటి మూడవ దశలో ఉంది.  

ఇది కూడా చదవండి..  ఒత్తిడిని తగ్గించే ఫుడ్.. ఇదిగో..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.