క్ష‌యవ్యాధి అంటే ఏమిటి..? నివారణ ఎలా..? 

సాక్షి లైఫ్ : క్షయవ్యాధినే " ట్యుబ‌ర్కులోసిస్"(టీబీ)అని అంటారు. గత 20ఏళ్లలో టీబీ కేసుల సంఖ్య చాలావరకు తగ్గింది. ప్రతి సంవత్సరం 10 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం వరల్డ్ టిబి డే ని జరుపుతున్నారు. ప్రస్తుతం క్షయవ్యాధిని నయం చేసేందుకు అనేక రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి గతంలో భయపడాల్సినంతగా ఈ వ్యాధి గురించి ఇప్పుడు భయపడాల్సిన పనిలేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి.. రాత్రిపూట నిల్వ ఉంచిన నీరు తాగడం సురక్షితం కాదా..?

 వరల్డ్ టీబీ డే సందర్భంగా సాక్షిలైఫ్ ప్రత్యేక కథనం..   

ప్ర‌తి సంవ‌త్స‌రం మార్చి 24న ప్ర‌పంచ క్ష‌య (టిబి) వ్యాధి దినోత్స‌వంగా నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా క్ష‌య వ్యాధి గురించి అవ‌గాహన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంది. అవును మనం క్షయ వ్యాధిని అంతం చేయగలం అనే థీమ్ తో ముందుకు వెళ్తున్నారు.

ఇప్ప‌టికీ మన దేశంలో ప్ర‌తి రోజూ 1400 మందికి పైగా క్షయవ్యాధి కారణంగా మ‌ర‌ణిస్తున్నట్లు ఈ వ్యాధి ఎంత ప్రాణాంత‌క‌ర‌మో మ‌నం అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యాధికి నివార‌ణ‌, చికిత్స ఉన్నా... వ్యాధి గురించి స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల వ్యాధి నిర్ధారణ, చికిత్స‌లో టిబి స‌మూల నిర్మూల‌న‌లో ఎన్నో అవాంత‌రాలు ఎద‌రువుతున్నాయి.

ఎలా వ్యాపిస్తుంది..?  

 క్ష‌య వ్యాధి 'మైకోబాక్టీరియం ట్యుబ‌ర్కులోసిస్' అనే బ్యాక్టీరియా వ‌ల్ల వ‌స్తుంది. ఊపిరితిత్తులు లేదా గొంతు టిబి ఉన్న రోగి ద‌గ్గిన‌ప్పుడు లేదా మాట్లాడినప్పుడు వెలుబ‌డే తుంప‌రలు ఆరోగ్యంగా ఉన్న వ్య‌క్తి పీల్చిన‌ప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. 

ఎలాంటివారికి వస్తుందంటే..?  

టిబి వ్యాధి సాధార‌ణంగా ఊరిపితిత్తుల‌కు సంక్ర‌మిస్తుంది. కొన్ని సార్లు ఈ వ్యాధి మెడ చుట్టూ ఉన్న లింఫ్ గ్రంథుల‌కు (లింఫ్ నోడ్ టిబి), వెన్నెముక‌కు (స్పైన్ టిబి), మెద‌డు (టిబి మెనింజైటిస్‌), గుండెకు, ఎముక‌ల‌కు, కీళ్ల‌కు ఇలా మ‌న శ‌రీరంలో ఏ అవ‌య‌వానికైనా రావ‌చ్చు. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది.

గత 2 దశాబ్దాలుగా భారతదేశంలో టీబీ కేసుల సంఖ్య తగ్గుతోంది. ముఖ్యంగా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కేసులు పెరుగుతున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

 పరీక్షలు..? 

రక్తం, కఫం, ఎక్స్ రే, వంటి వైద్య పరీక్షల ద్వారా క్షయవ్యాధిని  నిర్ధారిస్తారు. చికిత్స విషయంలో బెడాక్విలిన్, డెలామానిడ్ వంటి డ్రగ్ రెసిస్టెంట్ టిబికి కొత్త ఔషధాలు వాడడంవల్ల చాలా మంది రోగులు ఈ వ్యాధి నుంచి తక్కువ సమయంలోనే కోలుకుంటున్నారు. కాబట్టి ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. 

ఊపిరితిత్తుల టిబి వ‌చ్చిన వారికి దీర్ఘ‌కాలికంగా ద‌గ్గు (రెండు వారాలకు మించి), గ‌ళ్ల ప‌డ‌డం, జ్వ‌రం, ఛాతీనొప్పి, ఆక‌లి లేక‌పోవ‌డం, బ‌రువు త‌గ్గ‌డం, కొన్నిసార్లు ద‌గ్గిన‌ప్పుడు ర‌క్తం ప‌డ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఈ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు స‌రైన స‌మ‌యంలో సంప్ర‌దిస్తే, వారికి ఛాతి ఎక్స్‌రే లేదా సి.టి స్కాన్‌, గ‌ళ్ల ప‌రీక్ష, టిబి  రెసిస్టెన్స్ వంటి వివిధ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి ఈ వ్యాధిని గుర్తిస్తారు. 

ఇది కూడా చదవండి.. ఇండియన్ టాయిలెట్, వెస్ట్రన్ టాయిలెట్.. ఏది బెస్ట్..?  

టిబి రెండో సారి వస్తే..?  

స‌రైన స‌మ‌యంలో వ్యాధి నిర్ధారణ చేస్తే మందుల‌తో ఈ వ్యాధిని వంద శాతం న‌యం చేయ‌వ‌చ్చు. అయితే ఈ చికిత్స స‌మ‌యం 6 నెల‌ల వ‌ర‌కు ఉంటుంది. ఈ 6నెల‌ల స‌మ‌యంలో ప‌ల్మోనాల‌జిస్టుల ప‌ర్య‌వేక్ష‌ణలో క్ర‌మం త‌ప్ప‌కుండా మందుల‌ను వేసుకోవాలి. కొంత మంది కొన్ని వారాల చికిత్స అనంత‌రం జ్వరం, ద‌గ్గు వంటి ల‌క్ష‌ణాల నుంచి ఉప‌శ‌మ‌నం పొందాక‌, వైద్యుల‌ను సంప్ర‌దించ‌కుండా మందులు వేసుకోవ‌డం మానేస్తారు. ఇలాంటి వారిలో మందుల‌కు లొంగ‌ని టిబి (డ్ర‌గ్ రెసిస్టెంట్ టిబి) లేదా టిబి జ‌బ్బు రెండోసారి రావ‌డం, ఊపిరితిత్తుల‌లో దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు వేధించ‌డం జ‌ర‌గ‌చ్చు.

చికిత్స..?  

డ్ర‌గ్ రెసిస్టెంట్ టిబి వ‌చ్చిన వారు ద్వితీయ శ్రేణి టిబి మందులు 9 నుంచి 24 నెల‌ల వ‌ర‌కు వాడాల్సివ‌స్తుంది. ఈ చికిత్స‌లో వాడే మందుల‌కు ఒకింత దుష్ప్ర‌భావాలు ఎక్కువ కాబట్టి, అప్పుడప్పుడు ర‌క్త పరీక్ష‌లు,గుండె పరీక్షలు, వినికిడి, కంటి ప‌రీక్ష‌లు చేయించాలి. టిబిని త్వ‌ర‌గా గుర్తించ‌డం, 6 నెల‌ల చికిత్స క్ర‌మం త‌ప్ప‌కుండా వాడ‌డం ద్వారా చాలా వ‌ర‌కు ప్ర‌మాద‌క‌ర డ్ర‌గ్ రెసిస్టెంట్ టిబి పెర‌గ‌కుండా నియంత్రివ‌చ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

క్షయవ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..  

మాస్క్ ధ‌రించ‌డం, చేతులు శుభ్రంగా క‌డుక్కోవ‌డం, ద‌గ్గిన‌ప్పుడు లేదా తుమ్మిన‌ప్పుడు చేతి రుమాలు అడ్డుపెట్టుకోవ‌డం వంటి జాగ్ర‌త్త‌ల ద్వారా టిబిని కొంతమేరకు నిరోధించవ‌చ్చు.  

ఇది కూడా చదవండి.. కఫాల్ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : diagnose lungs treatment tuberculosis tb-symptoms tb world-tb-day world-tb-day-2024 world-tuberculosis-day-2024 world-tuberculosis-day

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com