Healthcare Sector in Budget : బడ్జెట్‌లో వైద్య రంగానికి రూ. 13,679 కోట్లు కేటాయించిన తెలంగాణ సర్కారు..
సాక్షి లైఫ్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వైద్య ఆరోగ్య శాఖకు అదనంగా రూ. 1,286 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆరోగ్య శాఖకు మొత్తం రూ. 13,679 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఇది రూ. 12,393 కోట్లుగా ఉండటం గమనార్హం.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా 'తెలంగాణ రైజింగ్ విజన్-2047'లో భాగంగా ఈ నిధులను వెచ్చించనున్నట్లు మంత్రి తెలిపారు.
వైద్య రంగంలో రానున్న కీలక మార్పులు..
డిజిటల్ హెల్త్ ప్రొఫైల్: రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ రూపొందించి, డిజిటల్ హెల్త్ కార్డులు పంపిణీ చేయనున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద నిక్షిప్తమై ఉంటుంది.
2026 చివరి నాటికి సనత్‌నగర్, ఎల్బీనగర్, అల్వాల్‌లోని టిమ్స్ (TIMS) ఆసుపత్రులు, నిమ్స్ విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ద్వారా అదనంగా 6,582 టెర్షియరీ పడకలు అందుబాటులోకి రానున్నాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం టెర్షియరీ బెడ్ల సంఖ్య 44,029కు చేరుకుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 17 వైద్య కళాశాలల నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. వీటితో పాటు 16 నర్సింగ్ కళాశాలలు, 28 పారామెడికల్ కళాశాలలను కూడా ప్రారంభించనున్నారు.
ప్రత్యేక క్లినిక్‌ల ఏర్పాటు..
జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ వర్గాల కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. డే కేర్ క్యాన్సర్ సెంటర్లు..క్యాన్సర్ రోగుల సౌకర్యార్థం. మైత్రి క్లినిక్‌లు.. ట్రాన్స్‌జెండర్ల ప్రత్యేక వైద్య అవసరాల కోసం. సీనియర్ సిటిజన్ క్లినిక్‌లు.. వృద్ధుల కోసం ప్రత్యేక సేవలు. మెంటల్ హెల్త్ కేర్..మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత.
చికిత్స ఆధారిత వైద్యం (Treatment-based) నుంచి నివారణ ఆధారిత వైద్యం (Preventive Healthcare) వైపు వ్యవస్థను మారుస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను పూర్తిస్థాయి ప్రభుత్వ సెకండరీ హెల్త్ కేర్ విభాగంగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా పర్యవేక్షణ, సేవల నాణ్యత మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
