Organ Transplantation : అవయవ మార్పిడిలో 'తెలంగాణను మోడల్ స్టేట్'గా నిలిపేందుకు పక్కా ప్రణాళిక'
సాక్షి లైఫ్ : అవయవ దానం, మార్పిడి చికిత్సల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఒక 'మోడల్ స్టేట్'గా నిలిపేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవయవ మార్పిడి ప్రక్రియలో పారదర్శకత, సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరల నియంత్రణపై మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ప్రైవేటు ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సల కోసం భారీగా వసూలు చేస్తున్న ధరల పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. వైద్యం అనేది రోగులకు భారంగా మారకూడదని, సామాన్యులకు కూడా ఇవి అందుబాటులో ఉండేలా ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు స్పష్టం చేశారు.
కీలక ఆదేశాలివే..
అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించేలా ప్రస్తుత మార్గదర్శకాలను, ప్రక్రియలను మరింత సరళతరం చేయాలని అధికారులను ఆదేశించారు. కఠినంగా 'క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్'.. ప్రైవేటు ఆస్పత్రుల్లో సేవల నియంత్రణకు చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
విదేశీ రోగులకు కొత్త మార్గదర్శకాలు..
ఇతర దేశాల నుంచి ఇక్కడకు అవయవ మార్పిడి కోసం వచ్చే రోగుల విషయంలో కొత్త పాలసీని రూపొందించాలని సూచించారు. దానం చేసిన అవయవాలు ఏ ఒక్కటీ వృథా కాకుండా, వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి తగిన వ్యవస్థను బలోపేతం చేయాలని పేర్కొన్నారు.
The Transplantation of Human Organs and Tissues Act (THOTA) అవయవ దాన చట్టం అమలుపై సమగ్రమైన విధానాన్ని రూపొందిస్తున్నామని, త్వరలోనే దీనిపై పూర్తిస్థాయి కార్యాచరణను ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు.
ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
