మంకీపాక్స్ ఆర్టిపీసీఆర్ RT-PCR కిట్‌ ను తయారుచేసిన ఏఎంటీజడ్

షేర్ చేయండి:
మంకీపాక్స్ ఆర్టిపీసీఆర్ RT-PCR కిట్‌ ను తయారుచేసిన ఏఎంటీజడ్

సాక్షి లైఫ్ : భారతీయ ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో సేవలందిస్తున్న  ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ (ఏఎంటీజడ్)అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. భారతదేశంలోనే మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన మంకీపాక్స్ RT-PCR కిట్‌ ను రూపొందించింది. మంకీపాక్స్ వైరస్ అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తుంది. దీంతో ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆరోగ్య రంగానికి అవసరమైన అనేక ఉత్పత్తులను అందించిన ఏఎంటీజడ్.. మరొక అడుగు ముందుకేసింది. మంకీపాక్స్ RT-PCR కిట్‌ ను తయారుచేసింది. 

 ఇది కూడా చదవండి.. తలనొప్పుల్లో ఎన్నిరకాలున్నాయో మీకు తెలుసా..? 

  ఇది కూడా చదవండి.. క్రానిక్ పెయిన్స్ కు సర్జికల్ చికిత్స తప్ప మరొక మార్గం లేదా..? 

 ఇది కూడా చదవండి.. రాత్రి పడుకునేటప్పుడు అరటిపండు తినకూడదా..? 

 ఇది కూడా చదవండి.. పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్ లో ఎలాంటి అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..?

మెడ్ టెక్ జోన్ ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ErbaMDx MonkeyPox RT-PCR కిట్‌ను అభివృద్ధి చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR)చే ధృవీకరించిన ఈ కిట్ శనివారం భారత ప్రభుత్వంలోని ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) నుంచి అనుమతి పొందింది.

మెడ్ టెక్ జోన్ సిఇఒ డాక్టర్ జితేంద్ర శర్మ మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య ఆవిష్కరణలలో భారతదేశం అగ్రగామిగా ఉందని ఈ ఆవిష్కరణ తెలియజేస్తుందని అన్నారు. ఇతర పరీక్షలతో పోలిస్తే, ఈ సంస్థ రూపొందించిన కిట్ అత్యంత ఖచ్చితమైన నిర్ధారణ పరీక్ష ఫలితాలను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..ఆఫ్రికాలో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్..

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.