రాత్రి పడుకునేటప్పుడు అరటిపండు తినకూడదా..? 

షేర్ చేయండి:
రాత్రి పడుకునేటప్పుడు అరటిపండు తినకూడదా..? 

సాక్షి లైఫ్ : అరటిపండులో అత్యంత విలువైన పోషకాలు ఉంటాయి. అంతేకాదు ఇందులో విటమిన్లు, ఖనిజాలు సైతం పుష్కలంగా ఉంటాయి. ఐతే రాత్రి సమయంలో అరటిపండు తినడం వల్ల బరువు పెరుగుతారనే చాలామంది అపోహ పడుతుంటారు. ఇది ఎంతవరకు వాస్తవం..? అసలు ఈ అపోహ నిజమా..? కాదా..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్ లో ఎక్కడపడితే అక్కడ లభించే పండు ఏదైనా ఉందా అంటే..? అది అరటిపండే.. పొటాషియానికి మంచి మూలం అరటి పండు. ఇది కండరాల సక్రమ పనితీరులోనూ, రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచడంలోను కీలక పాత్ర పోషిస్తుంది. అరటిపండ్లలో ఫైబర్ కూడా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..ఆఫ్రికాలో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్..

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?

ఆరోగ్య ప్రయోజనాలు.. 

రాత్రి వేళ అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతుందనే అపోహ ఉన్నప్పటికీ, అరటిపండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చాలానే  ఉన్నాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టం నుంచి శరీరాన్ని కాపాడతాయి. అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం కూడా ఉంటుంది, ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు నిద్ర విషయంలో కూడా ఎంతో సహాయపడుతుంది.

బరువు.. 

రాత్రి వేళ అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతుందనే భావనకు శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు. రోజంతా శరీరానికి అవసరమైన కేలరీల కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు మాత్రమే బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. అరటిపండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి సాయంత్రం కూడా ఆరోగ్యకరమైన స్నాక్స్ లో భాగంగా తీసుకుంటూ ఉంటారు.

రాత్రి సమయాల్లో పండ్లు తినడం.. వల్ల.. 

కొంతమంది రాత్రి వేళ పండ్లు తినడం వల్ల బరువు పెరుగుతుందని నమ్ముతుంటారు, కానీ ఈ వాదనకు శాస్త్రీయ ఆధారాలు లేవు. నిజానికి, పడుకునే ముందు అరటిపండు తినడంవల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడమేకాకుండా ఆకలిని నివారించడంలో సహాయపడుతుంది.  

ఇది కూడా చదవండి..ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమిటి.. ?

ఇది కూడా చదవండి..పచ్చబొట్టు తొలగింపు ప్రక్రియ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?

ఇది కూడా చదవండి..ఎం పాక్స్ : ఢిల్లీలోని ఆరు ఆసుపత్రులలో అందుబాటులో మంకీపాక్స్ చికిత్స..

ఇది కూడా చదవండి..చాందీపురా వైరస్‌ లక్షణాలను ఎలా గుర్తించాలి..?

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.