Uniform Standards for ICUs Across India : దేశవ్యాప్తంగా ఐసీయూల్లో ఒకే రకమైన ప్రమాణాలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!
సాక్షి లైఫ్ : దేశంలోని ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) సేవల నాణ్యతపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఐసీయూల్లో కనీస ప్రమాణాలను అమలు చేసేందుకు తక్షణమే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ అహ్రానుద్దీన్ అమనుల్లా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 20న కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
మూడు వారాల్లో జాతీయ ముసాయిదా..
ఐసీయూల నిర్వహణకు సంబంధించి నిపుణుల కమిటీ రూపొందించిన 'గైడ్‌లైన్స్ ఫర్ ఆర్గనైజేషన్ అండ్ డెలివరీ ఆఫ్ ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్' డాక్యుమెంట్‌ను కోర్టు ఆమోదించింది. ఈ నిబంధనల అమలుకు సంబంధించి మూడు వారాల గడువు విధిస్తూ, ముఖ్యమైన మార్పులను సూచించింది.
ప్రాధాన్య అంశాలు..
ప్రతి రాష్ట్రం తమ పరిధిలోని ఐసీయూల్లో సిబ్బంది, పరికరాలు, లాజిస్టిక్స్‌కు సంబంధించి అత్యవసరమైన 5 అంశాలను గుర్తించి నివేదిక ఇవ్వాలి.
నర్సింగ్ సిబ్బందికి శిక్షణ..
ఐసీయూలో రోగుల వద్ద 24 గంటలూ ఉండేది నర్సులే కాబట్టి, వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌ను కోర్టు ఆదేశించింది.
హాస్పిటల్ లోకేటర్..
అత్యవసర సమయాల్లో ప్రజలు సమీపంలోని ఐసీయూ సదుపాయం ఉన్న ఆసుపత్రిని గుర్తించేలా GPS ఆధారిత 'హాస్పిటల్ లోకేటర్'ను రూపొందించాలని సూచించింది.
డిశ్చార్జ్ నిబంధనలు..
రోగి పరిస్థితి నిలకడగా ఉన్నప్పుడు, కేవలం వెంటిలేటర్ లేదా మానిటరింగ్ అవసరం లేని పక్షంలో వారిని జనరల్ వార్డులకు తరలించేలా స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని కోర్టు పేర్కొంది.
పర్యవేక్షణ బాధ్యత కార్యదర్శులదే..
ఈ మార్గదర్శకాల అమలుపై ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శులు లేదా కార్యదర్శులు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. వారం రోజుల్లోగా నిపుణులతో సమావేశం నిర్వహించి, క్షేత్రస్థాయిలో అమలుకు అవసరమైన 'స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్' (SOPs) సిద్ధం చేయాలని ఆదేశించింది.
ఐసీయూ సేవల్లో పారదర్శకత, నాణ్యత ఉండాలి. రోగుల బంధువులకు ఐసీయూ చికిత్సపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ కొత్త నిబంధనలు తొలగిస్తాయి." అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసు తదుపరి విచారణ మే 18కి వాయిదా పడింది.
ఇది కూడా చదవండి..Ban Paraquat : ప్రాణాంతక గడ్డి మందు "పారాక్వాట్" ను నిషేధించాల్సిందే..! : వైద్య నిపుణులు
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
