Viral cases in Hyderabad : హైదరాబాద్ నగరంలో ‘వైరల్’ పంజా.. ఆసుపత్రులకు క్యూ కడుతున్న బాధితులు..
సాక్షి లైఫ్ : హైదరాబాద్ నగరంలో ‘వైరల్’ పంజా విసరడంతో పలు వ్యాధులు చుట్టుముడుతున్నాయి. చలికాలంలో సైతం ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణ మార్పులు నగరవాసుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. గత కొద్ది రోజులుగా గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతల మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో రోగనిరోధక శక్తి తగ్గి, జనం వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు.
కిక్కిరిసిపోతున్న ఆసుపత్రులు..
నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రి సహా గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ దవాఖానాల్లో రద్దీ పెరిగింది. బస్తీ దవాఖానాలకు వచ్చే రోగుల్లో అత్యధికులు దగ్గు, ఒళ్లు నొప్పులు, జ్వరంతో బాధపడుతు న్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రైవేటు క్లినిక్‌లు కూడా రోగులతో కిక్కిరిసిపోతున్నాయి.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..!
ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?
ఇన్‌ఫ్లుయెంజా కలవరం..
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో H3N2, ఇన్‌ఫ్లుయెంజా బి వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. వీటి లక్షణాలు కోవిడ్‌ను పోలి ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పొడి గాలి, ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల వైరస్ వ్యాప్తికి అనుకూల వాతావరణం ఏర్పడిందని జిల్లా ఆరోగ్య శాఖాధికారులు వెల్లడించారు. కొందరిలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండటంతో ఐసీయూలో చేరాల్సిన పరిస్థితి వస్తోంది.
ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు ముక్కు, నోటికి రుమాలు అడ్డు పెట్టుకోవాలి.
తరచుగా చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
కళ్ళు, ముక్కు, నోటిని పదే పదే తాకకూడదు.
పౌష్టికాహారం తీసుకుంటూ, ధారాళంగా నీరు తాగాలి.
అనారోగ్యంగా ఉన్నప్పుడు జనసమూహాల్లోకి వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలి. ప్రస్తుతం వైరల్ ఇన్‌ఫెక్షన్ల తీవ్రత ఎక్కువగా ఉన్నందున, ఏ చిన్న లక్షణం కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
