ఢిల్లీలో మరింతగా తగ్గిన గాలి నాణ్యత..
సాక్షి లైఫ్ : దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం నానాటికీ దిగజారుతోంది. గాలి నాణ్యత ఏ మాత్రం మెరుగుపడినట్లు కనిపించడం లేదు. శని, ఆదివారాల్లో ఉదయం పొగమంచు కమ్ముకుంది. దీంతో రోడ్లపై వచ్చి పోయే వాహనాలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీలో ఆదివారం ఉదయం 7 గంటలకు గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ)277 వద్ద నమోదైంది. ఆనంద్ విహార్ ఏరియాలోని ఏక్యూఐ చాలా దారుణంగా 334కి పడిపోయిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సిపిసిబి) గణాంకాలు చెబుతున్నాయి. రాబోయే మూడు రోజుల పాటు ఢిల్లీలో వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని సిపిసిబి వెల్లడించింది.
ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి నిర్దిష్ట పండ్లు ఉన్నాయా..?
ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోపతి అంటే ఏమిటి..?
ఏక్యూఐ..
ఇండియా గేట్ , పరిసర ప్రాంతాలలో పొగమంచు తీవ్రంగా ఉంది. ఇక్కడ ఏక్యూఐ 251కి పడిపోయింది, ఇది మరింత ఘోరంగా పడిపోయిందని దీని కారణంగా ప్రజలఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చెబుతోంది. పలు చోట్ల ఏక్యూఐ 226కంటే తక్కువగా పడిపోయింది.
పలు ప్రాంతాల్లో నీళ్లు..
వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవటానికి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ బృందం నగరంలో నీటిని చల్లుతోంది. గ్రేప్ మొదటి దశ చర్యలను రాజధానిలో అమలు చేస్తున్నారు. దీని కింద, దుమ్మును తగ్గించడానికి, హాట్‌స్పాట్ ప్రాంతాలలో నీటిని చల్లడం ద్వారా కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?..
ఇది కూడా చదవండి..జాక్‌ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది..?
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
