ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎందుకు జరుపుతారు..?
సాక్షి లైఫ్ : ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా జూన్ 5వ తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటారు. మొదటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని1974లో నిర్వహించారు. పర్యావరణ ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం,వాటి వల్ల కలిగే నష్టాన్ని ఎలా నివారించవచ్చనే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అసలు ఈ దినోత్సవం ఎలా మొదలైంది..?
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?
ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2024థీమ్
పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 5న జరుపుకుంటారు. పర్యావరణ పరిరక్షణ అనేది మన పిల్లలకు, భవిష్యత్తు తరాలకు చాలాఅవసరం. మానవులకు, పర్యావరణానికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే ప్రజలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం చరిత్ర..
1972 సంవత్సరంలో, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) మానవ పర్యావరణంపై స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్ సందర్భంగా జూన్ 5ని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభిం చారు. మొదటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని1973లో "ఒకే భూమి" అనే థీమ్‌తో జరుపుకున్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2024 థీమ్..
ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఒక థీమ్‌తో జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ 'భూ పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువు స్థితిస్థాపకత'. 2023లో ఈ దినోత్సవాన్ని 'బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్' అనే థీమ్‌తో జరుపుకున్నారు. జూన్ 5న జరుపుకునే ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి మరో పేరుప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని వనమహోత్సవం అని కూడా అంటారు.
పర్యావరణ దినోత్సవం ప్రాముఖ్యత..
భారతదేశంతో సహా అనేక ఇతర దేశాలలో కాలుష్య సమస్య కనిపిస్తుంది. నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యం మనుషులకే కాదు మన ప్రకృతికి కూడా ప్రమాదకరం. ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన ప్రకృతి మానవ జీవితానికి ఆధారం. ప్రకృతి మనకు జీవించడానికి అవసరమైన అన్ని వనరులను అందిస్తుంది. అటువంటి పరిస్థితిలో పర్యావరణానికి ముప్పువాటిల్లితే మన జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాలుష్యం, వాతావరంలో మార్పుల నుండి ప్రకృతిని రక్షించే లక్ష్యంతో పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. పరిశుభ్రత ప్రచారాలు, చెట్ల పెంపకం, ఇంధన పొదుపు వంటి చర్యలను అనుసరించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా మనం పెద్ద ఎత్తున సహకారం అందించవచ్చు.
ఇది కూడా చదవండి.. యునాని ఔషధాలు ఎలా పనిచేస్తాయి..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
