World Cancer Day 2026: వరల్డ్ క్యాన్సర్ డే 2026: 'క్యాన్సర్'కు చెక్ పెట్టేందుకు.. అధునాతన చికిత్సలు..!
సాక్షి లైఫ్ : గత కొన్నాళ్ల క్రితం 'క్యాన్సర్ అంటే చనిపోతారు" అనే భయం చాలా మందిలో ఉండేది. కానీ, నేడు అందుబాటులోకి వచ్చిన ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో క్యాన్సర్ వచ్చినా ఆ మహమ్మారిని సులువుగా ఎదుర్కోవచ్చు. ఎలాంటి తీవ్రమైన క్యాన్సర్ నైనా జయించవచ్చని పరిశోధకులు నిరూపిస్తున్నారు. అలాంటి మెడికల్ ఇన్నోవేషన్స్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.
శాస్త్రవేత్తలు చేస్తున్న అద్భుతమైన పరిశోధనలు క్యాన్సర్ మహమ్మారిని అంతమొందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సకాలంలో గుర్తిస్తే క్యాన్సర్‌ను జయించవచ్చని నేటి ఆధునిక వైద్యం నిరూపిస్తోంది. ఈ ఏడాది 'యునైటెడ్ బై యూనిక్' (United by Unique) అనే నినాదంతో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవ్వాళ వరల్డ్ క్యాన్సర్ డే 2026 సందర్భంగా 'క్యాన్సర్'కు చెక్ పెట్టేందుకు అధునాతన చికిత్సలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
యునైటెడ్ బై యూనిక్ అంటే..?
ప్రతి వ్యక్తి క్యాన్సర్ ప్రయాణం భిన్నంగా ఉంటుంది. వారి శరీర తత్వం, వ్యాధి తీవ్రత, జీవన పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. అందుకే, అందరికీ ఒకే రకమైన చికిత్స కాకుండా, రోగికి తగినట్లుగా వారి ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయా తీవ్రతను బట్టి చికిత్స అందించడమే 'యునైటెడ్ బై యూనిక్' (United by Unique) అనే నినాదంతో ఈ ఏడాది వరల్డ్ క్యాన్సర్ డే ప్రధాన లక్ష్యం.
క్యాన్సర్ చికిత్సలో 7 అద్భుత ముందడుగులు (Breakthroughs)..
వైద్య రంగంలో వస్తున్న పెను మార్పులు క్యాన్సర్ రోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. అవేంటంటే..?
లిక్విడ్ బయాప్సీ (Liquid Biopsy)..ఇకపై శరీరంలోని కొంత భాగాన్ని ను తీసి పరీక్ష (Surgical Biopsy) చేయాల్సిన అవసరం లేకుండానే, కేవలం రక్త పరీక్ష ద్వారా శరీరంలో క్యాన్సర్ కణాలు ఎక్కడ ఉన్నాయో, అవి ఎలా పెరుగుతున్నాయో ప్రాథమిక దశలోనే కనిపెట్టే అద్భుతమైన టెస్ట్ అందుబాటులోకి వచ్చింది.
ఏఐ (Artificial Intelligence) విశ్లేషణ..
రేడియాలజీ స్కాన్లను కృత్రిమ మేధ (AI) ద్వారా విశ్లేషించడం వల్ల మానవ కంటికి దొరకని చిన్న చిన్న కణితిలను కూడా అత్యంత కచ్చితత్వంతో గుర్తించడం సాధ్యమవుతోంది.
పర్సనలైజ్డ్ మెడిసిన్..
ప్రతి రోగి జన్యు క్రమాన్ని (Genomic Profiling) బట్టి వారికి ఏ మందు బాగా పనిచేస్తుందో ముందే తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా చికిత్సను రూపొందిస్తున్నారు.
ఇమ్యూనో థెరపీ (Immunotherapy)..
మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని ఉత్తేజపరిచి, అది స్వయంగా క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేసేలా చేసే ఈ విధానం క్యాన్సర్ చికిత్సలో గేమ్ ఛేంజర్‌గా మారింది.
mRNA వ్యాక్సిన్లు..
కోవిడ్ సమయంలో వెలుగులోకి వచ్చిన mRNA సాంకేతికతను ఇప్పుడు క్యాన్సర్ నివారణ కోసం అందించే చికిత్సకు వ్యాక్సిన్లుగా మలుస్తున్నారు. ఇవి క్యాన్సర్ కణాలు మళ్లీ రాకుండా అడ్డుకుంటాయి.
ప్రోటాన్ బీమ్ థెరపీ..
సాధారణ రేడియేషన్ లాగా కాకుండా, కేవలం క్యాన్సర్ ఉన్న చోటనే హై-ఎనర్జీ కిరణాలను పంపి, చుట్టూ ఉన్న ఆరోగ్యకరమైన కణజాలం దెబ్బతినకుండా చేసే సురక్షితమైన పద్ధతి ఇది.
రోబోటిక్ సర్జరీ..
అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో ఉన్న క్యాన్సర్ గడ్డలను రోబోటిక్ చేతుల సాయంతో తక్కువ రక్తస్రావం, తక్కువ కోతతో తొలగించడం ద్వారా రోగులు త్వరగా కోలుకుంటారు.
అప్రమత్తతే అసలైన ఆయుధం..
క్యాన్సర్ నివారణలో కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. క్యాన్సర్లకు 40శాతం పొగాకు ఉత్పత్తులే ప్రధాన కారణం. కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం అంటే.. తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోకూడదు. ఎందుకంటే ఇటీవల ఎలాంటి దురలవాట్లు లేకపోయినా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకునేవారిలోనే ఎక్కువగా క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కనుక ప్రాసెస్డ్ ఫుడ్స్ ను మానేయడం ఉత్తమమని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
రెగ్యులర్ స్క్రీనింగ్..
40 ఏళ్లు దాటిన వారు ఏటా మామోగ్రామ్, ప్యాప్ స్మియర్ వంటి పరీక్షలు చేయించుకోవడం మేలు. క్యాన్సర్ పట్ల భయం వద్దు.. అవగాహనే శ్రీరామ రక్ష. ప్రారంభ దశలో గుర్తిస్తే క్యాన్సర్ ఏ మాత్రం ప్రాణాంతకం కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
