టూత్ బ్రష్‌ను ఎంతకాలం వరకు ఉపయోగించవచ్చు?
సాక్షి లైఫ్ : దంతాలను రక్షించుకోవడానికి రోజుకు కనీసం రెండుసార్లు పళ్ళు తోముకోవడం చాలా అవసరం. నిజం చెప్పాలంటే చాలా మంది ఇలా చేయరు కానీ మనం ఉదయం, సాయంత్రం పళ్ళు తోముకుంటే దంతాలు చాలా సురక్షితంగా ఉంటాయి. అంతేకాదు ఎలాంటి దంత సమస్యలు రావని చెబుతున్నారు వైద్యనిపుణులు.
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
టూత్ బ్రష్..
రెండుసార్లు పళ్ళు తోముకోవడం ఎంత ముఖ్యమో.. ప్రతిరోజూ వాడే టూత్ బ్రష్ ఎంత కాలం వాడుతున్నామనేది కూడా అంతే ముఖ్యం. కొంతమంది ఒకే బ్రష్‌తో ఏడాది మొత్తం పళ్ళు తోముకుంటారు. కానీ అలా చేయకూడదని పరిశోధనలు చెబుతున్నాయి.
ఎంత కాలం వాడాలి..?
టూత్‌బ్రష్‌ని ఎంత కాలం వాడాలో అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి.. కాలం గడిచే కొద్దీ టూత్‌బ్రష్‌లో క్రిమికీటకాలు పెరుగుతాయి. ఇలాంటి బ్రష్‌ను మళ్లీ ఉపయోగించవద్దని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. మూడు లేదా నాలుగు నెలలకు మించి బ్రష్ వాడటం వల్ల దంతాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇలా ఎక్కువకాలం ఒకే బ్రష్ ను వాడడం వల్ల పళ్ల నుంచి ఆహార వ్యర్థాలు, మురికి సరిగా పోదు.
పాత బ్రష్‌ను ఎక్కువకాలం ఉపయోగించినప్పుడు, నోటిలో క్రిములు పెరిగి దంతాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి ఆయా సమస్యల బారీన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా బ్రష్ ను మార్చాలని సూచిస్తున్నారు డాక్టర్లు. మూడు నాలుగు నెలల తర్వాత బ్రష్ మార్చుకోవాలని వారు చెబుతున్నారు. ఎక్కువకాలం ఒకే బ్రష్ ను ఉపయోగించడం వల్ల బ్రష్ పై ఉండే ముళ్ల లాంటివి అరిగి పోయే అవకాశం ఉంది.
మార్చకపోతే దంతాలను రక్షించే ముఖ్యమైన పొర ఎనామిల్ తొలగిపోతుంది. తద్వారా దంతాలు దెబ్బతింటాయి. కాబట్టి మూడు లేదా నాలుగు నెలలకు మించి బ్రష్‌ను ఉపయోగించకపోవడమే దంతాల ఆరోగ్యానికి మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
