మినపప్పు ఎంత ఆరోగ్యమో తెలుసా..? 

సాక్షి లైఫ్ : దక్షిణ భారతదేశంలోని పలురాష్ట్రాల్లో మినపప్పుతో అనేకరకాల వంటకాలు తయారు చేస్తుంటారు. ఈ పప్పును ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇడ్లీలు, దోసెలు, వడలు వంటి అల్పాహారాల తయారీలో మినపప్పు చాలా ప్రధానమైంది. అంతేకాదు వంటింట్లో తప్పనిసరిగా ఉండే పప్పు..ముఖ్యంగా కొన్నిరకాల జబ్బుల బారీన పడిన వారు త్వరగా కోలుకోవాలంటే మినపప్పుతోచేసిన వంటకాలు ఎక్కువగా అందిస్తుంటారు. 

అటువంటి వాటిలో మినపగారెలు, సున్నుండలు ఖచ్చితంగా ఉంటాయి. మినపప్పులో ఉండే ఐరన్‌ కంటెంట్‌ శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదవైద్యంలో ఆస్తమా, పక్షవాతం, ఆర్థరైటిస్, వంటి వ్యాధుల నివారణలో కూడా ఈ పప్పును వాడుతారు. మినపప్పులో రుచితోపాటు ఎన్నోఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ పప్పులో ప్రోటీన్లు, విటమిన్ "బీ"  పుష్కలంగా లభిస్తాయి. మినపప్పు తీసుకోవడం వల్ల తల నొప్పి, జ్వరం, ఇంఫ్లమేషన్ వంటి సమస్యలనుంచి బయటపడొచ్చు.

ముఖ్యంగా మహిళల సౌందర్యపోషణ విషయంలో మినపప్పు ద్వారా అనేకరకాల ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో మినరల్స్ , విటమిన్స్,  పుష్కలంగా ఉంటాయి. ఇవి సన్ టాన్స్ ను తొలగిస్తాయి. ఆరోగ్యవంతమైన, జుట్టుకు మినపప్పులో ఉండే పోషకాలు ఎంతగానో మేలు చేస్తాయి. 

మొటిమల సమస్యతో బాధపడేవారు మినపప్పుని కొద్దిగా పాలల్లో వేసి మెత్తగా నూరిన మిశ్రమానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి రాసుకుని, ఆ తర్వాత చల్లని నీళ్లతో కడిగేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అంతేకాదు పురుషుల లైంగిక సమస్యలను తొలగించడంలో మినపప్పు ప్రధాన పాత్ర పోషిస్తుంది.

మినపప్పుతో..  

 నాడీ బలహీనత, పాక్షిక పక్షవాతం, ముఖ పక్షవాతం, ఇతర రుగ్మతల నివారణకు వివిధ ఆయుర్వేద ఔషధాలలో మినపప్పును ఉపయోగిస్తారు.
 -మధుమేహం ఉన్నవారికి కూడా మంచిది. మినపప్పు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది.

-బరువు తగ్గించడంలో మినప పప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు ఎముకలను దృఢంగా ఉంచుతాయి. 
-కిడ్నీల సంరక్షణలో మినపప్పు అద్భుతంగా పనిచేస్తుంది.  

 ఫైబర్‌, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం వంటివి మినపప్పులో ఉన్నాయి. ఈ పప్పు గట్‌ హెల్త్‌ ను మెరుగుపరిచి, శరీరంలోని ఐరన్‌ లెవల్స్‌ ను పెంచేందుకు సహకరిస్తుంది. గుండెను ఆరోగ్యంగా, దృడంగా ఉంచుతుంది.

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : urad-dal-benefits

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com