సాక్షి లైఫ్ : ప్రజల్లో ఆరోగ్య వ్యవహారాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) బీబీనగర్ వినూత్న అడుగు వేసింది. ప్రజల ముంగిటకు వైద్య సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా క్యాంపస్లో కమ్యూనిటీ రేడియో స్టేషన్ (CRS) 89.6 FM ను ప్రారంభించింది. దేశంలోని ఎయిమ్స్ సంస్థల్లో ఇలాంటి సదుపాయాన్ని తీసుకురావడం ఇదే తొలిసారి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమితా అగర్వాల్ ఈ రేడియో స్టేషన్ను లాంఛనంగా ప్రారంభించారు. ఆరోగ్య సమాచారాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో, కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు.
రేడియో సేవలు..?
ఎయిమ్స్ బీబీనగర్ చుట్టుపక్కల సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో ఈ 89.6 FM రేడియో సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య విద్య, వ్యాధుల నివారణ చర్యలపై సందేశాలతో పాటు కమ్యూనిటీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ రేడియో ద్వారా ప్రసారం చేస్తారు.
'డయల్ ఏ డాక్టర్'.. శ్రోతల కోసం ప్రత్యేకంగా "డైల్ ఏ డాక్టర్ (Dial a Doctor)" అనే ఇంటరాక్టివ్ కార్యక్రమాన్ని తీసుకువస్తున్నట్లు సీఆర్ఎస్ ఆపరేషనల్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ ఏ.ఎస్. సుభద్ర తెలిపారు. దీని ద్వారా ప్రజలు నేరుగా నిపుణులైన వైద్యులతో మాట్లాడి తమ ఆరోగ్యపరమైన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ముందస్తు ఆరోగ్య జాగ్రత్తలపై సలహాలు పొందవచ్చు.
మెరుగైన జీవనశైలి కోసం..
కేవలం రోగాల గురించే కాకుండా, ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎలా అలవర్చుకోవాలి, ముఖ్యమైన ఆరోగ్య సమస్యల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే అంశాలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు ప్రసారం చేయనున్నారు. విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం, వైద్యుల సలహాల కోసం కవరేజీ పరిధిలోని ప్రజలు 89.6 FM ట్యూన్ చేసి ఈ సేవలను వినియోగించుకోవాలని ఎయిమ్స్ ప్రతినిధులు సూచించారు.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com