FSSAI : పండ్లలో 'పాయిజన్'.. కృత్రిమంగా పండిస్తే కఠిన చర్యలు..! : ఎఫ్ఎస్ఎస్ఏఐ 

సాక్షి లైఫ్ : నోరూరించే మామిడి, నోటికందించే అరటి.. ఈ కాలంలో మార్కెట్‌లోకి విరివిగా వస్తుంటాయి. అయితే, సహజంగా పండాల్సిన ఈ పండ్లను కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు ప్రమాదకర రసాయనాలతో పండిస్తున్నారు. దీనిపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) తాజాగా తీవ్రంగా స్పందించింది. దేశవ్యాప్తంగా అక్రమ పండ్ల పక్వ ప్రక్రియపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్రాల ఆహార భద్రతా కమిషనర్లను ఆదేశించింది.

 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

 

ఈ రసాయనాలు.. ఎందుకంత ప్రమాదం..?

సాధారణంగా పండ్లను త్వరగా పండించడానికి 'కాల్షియం కార్బైడ్' వాడుతుంటారు. కాల్షియం కార్బైడ్ వాడటం వల్ల ఆహారం విషతుల్యమవుతుంది. దీనివల్ల వాంతులు, చర్మంపై పుండ్లు, గొంతులో మంట, మింగడంలో ఇబ్బంది వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ రసాయనం వల్ల వెలువడే ఎసిటిలిన్ గ్యాస్‌లో ఆర్సెనిక్, ఫాస్పరస్ వంటి విష పదార్థాల ఆనవాళ్లు ఉంటాయి.

FSSAI హెచ్చరికలు..

పండ్ల మార్కెట్లు, మండిలు, కోల్డ్ స్టోరేజీలు, హోల్‌సేల్ సెంటర్లలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అరటి వంటి పండ్లను 'ఎథెఫాన్' (Ethephon) ద్రావణంలో నేరుగా ముంచి పండించడం కూడా చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఎథిలీన్ గ్యాస్ వాడకానికి కొన్ని నిబంధనలు ఉన్నప్పటికీ, పండ్లు నేరుగా రసాయన ద్రావణానికి తాకకూడదు.నిల్వ ఉంచిన చోట లేదా పండ్ల బుట్టల వద్ద కాల్షియం కార్బైడ్ కనిపిస్తే, అది నేరానికి ఆధారంగా పరిగణించి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లపై (FBO) క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు.

వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

అతిగా మెరిసిపోతుంటే జాగ్రత్త..పండు అంతటా ఒకే రకమైన రంగు, ఉదాహరణకు మామిడి పండు మొత్తం పసుపు రంగులో ఉంటే అది కృత్రిమంగా పండించినది కావొచ్చు. సహజంగా పండిన పండులో ఉండే తియ్యదనం, పరిమళం రసాయనాలతో పండిన పండ్లలో ఉండదు.

పండ్లను తినేముందు కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు ఉప్పు కలిపిన నీటిలో ఉంచి, ఆపై శుభ్రమైన నీటితో కడిగి వాడటం ఉత్తమం. వీలైనంత వరకు కాయలుగా ఉన్నప్పుడే కొని, ఇంట్లోనే గడ్డిలో లేదా బియ్యం డబ్బాలో పెట్టి సహజంగా పండించుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. ప్రీ-మెనోపాజ్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? అవేంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : unhealthy-foods fssai carbide-fruits carbide carbide-vegetables yellow-fruits summer-fruits
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com