సాక్షి లైఫ్ : హైదరాబాద్ నగర వాసులను ఊబకాయం (Obesity) ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నగరంలో ప్రతి పది మందిలో ఎనిమిది మంది అధిక బరువుతో బాధపడుతున్నట్లు తాజా నివేదికలు హెచ్చరిస్తు న్నాయి. అపోలో హాస్పిటల్స్ విడుదల చేసిన 'హెల్త్ ఆఫ్ ది నేషన్ (HoN) నివేదిక 2026' ప్రకారం.. హైదరాబాద్‌లో ఊబకాయం రేటు ఏకంగా 81.3 శాతానికి చేరుకుంది.
దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో ముంబై (81.6శాతం) ప్రథమ స్థానంలో ఉండగా, హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ సైతం మన నగరంతో సమానంగా 81.3 శాతంతో నిలిచింది. గత ఏడాది (2025) 63 శాతంగా ఉన్న ఈ గణాంకాలు, కేవలం ఏడాది కాలంలోనే 18 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఊబకాయం విస్తరణను గమనిస్తే పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఈ జాబితాలో ముంబై 81.6 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, మన హైదరాబాద్ 81.3 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీ కూడా హైదరాబాద్‌తో సమానంగా 81.3 శాతం నమోదు చేయడం గమనార్హం. ఇతర మెట్రో నగరాలైన కోల్‌కతా (78.4శాతం), బెంగళూరు (77.8శాతం), చెన్నై (77.3శాతం) స్వల్ప తేడాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే, దక్షిణాది నగరాల కంటే ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో జీవనశైలి మార్పుల ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ప్రధాన కారణాలు ఏంటి..?
శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, ఒత్తిడి వల్ల ఎక్కువగా తినడం (Stress eating) వంటివి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. నిద్రపోయే ముందు వరకు ఫోన్లను చూడటం వల్ల నిద్రలేమి (Poor sleep hygiene) ఏర్పడి, అది మెటబాలిక్ వ్యాధులకు దారితీస్తోందని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ ఇప్పటికే దేశ డయాబెటిస్ రాజధానిగా ఉంది. ఇప్పుడు పెరుగుతున్న ఈ ఊబకాయం వల్ల 20, 30 ఏళ్ల యువతలోనే జీవనశైలి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది, అని ఉస్మానియా ఆస్పత్రి గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం హెడ్ డాక్టర్ మధుసూదన్ చెబుతున్నారు.
మరోవైపు, అనవసరంగా స్టెరాయిడ్ల వినియోగం కూడా బరువు పెరగడానికి కారణమవుతోందని అపోలో ఇంటర్నల్ మెడిసిన్ విభాగం హెడ్ డాక్టర్ రాజీవ్ పాల్ హెచ్చరించారు. చిన్నపిల్లల్లో కూడా 'నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్' వంటి సమస్యలు రావడం ప్రమాదకరమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
పరిష్కారం ఏంటి మరి..?
ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించడం, రోజూ వ్యాయామం చేయడం, స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని నియంత్రించుకోవడం ద్వారానే ఈ 'సైలెంట్ కిల్లర్' నుంచి బయటపడగలమని నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..Women health : ఒక నెల పీరియడ్స్ రావడం, మరో నెల రాకపోవడం ప్రమాదకరమా..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com