సాక్షి లైఫ్ : ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లో హోమియోపతికి ప్రత్యేక స్థానం ఉంది. తక్కువ ఖర్చుతో, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వ్యాధిని మూలాల నుంచి నయం చేయడంలో హోమియో చికిత్స కీలకంగా పనిచేస్తుంది. హోమియోపతి పితామహుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ శామ్యూల్ హానిమాన్ జయంతిని పురస్కరించుకుని ఏటా ఏప్రిల్ 10న 'ప్రపంచ హోమియోపతి దినోత్సవం' జరుపుకుంటాం. ఈ సందర్భంగా హోమియోపతిపై ప్రజల్లో ఉన్న కొన్ని అపోహలు, వాటి వెనుక ఉన్న వాస్తవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
అపోహ 1: కోర్సు మధ్యలో ఆపేయవచ్చా..?
వాస్తవం: ఏదైనా వైద్య విధానంలో పూర్తి కోర్సు వాడటం చాలా ముఖ్యం. హోమియోపతిలో కూడా వ్యాధి స్వభావం, తీవ్రతను బట్టి వైద్యులు కోర్సును నిర్ణయిస్తారు. మధ్యలోనే మందులు ఆపేయడం వల్ల వ్యాధి మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యులు సూచించిన గడువు వరకు మందులు వాడటం అవసరం. హోమియో పతి అనేది కేవలం ఒక విభాగం మీద మాత్రమే కాకుండా, మొత్తం శరీరంపై ప్రభావం చూపే సంపూర్ణ చికిత్సా విధానం. సరైన అవగాహనతో ఈ వైద్య విధానాన్ని అనుసరిస్తే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అపోహ 2 : హోమియోపతి మందులు చాలా నెమ్మదిగా పనిచేస్తాయా..?
వాస్తవం : హోమియోపతి చికిత్స నెమ్మదిగా ఫలితాన్నిస్తుందనేది ఒక సాధారణ అపోహ. నిజానికి, వ్యాధి తీవ్రతను బట్టి ఈ మందులు పనిచేస్తాయి. అనేక అత్యవసర పరిస్థితుల్లోనూ హోమియోపతి అద్భుతమైన ఫలితాలను చూపింది. ఇతర వైద్య విధానాలు పైపైన లక్షణాలను తగ్గిస్తే, హోమియోపతి మాత్రం వ్యాధిని దాని మూలాల నుంచి నిర్మూలించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే ఇది దీర్ఘకాలంలో అత్యంత ప్రయోజనకరం.
అపోహ 3 : హోమియోపతి మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా..?
వాస్తవం : అవును, హోమియోపతి మందులు ప్రకృతి సిద్ధమైన పదార్థాల నుంచి తయారవుతాయి. వీటిలో ఎటువంటి రసాయనాలు లేదా స్టెరాయిడ్లు ఉండవు. అందుకే ఇవి అత్యంత సురక్షితమైనవి. శిశువుల నుంచి గర్భిణీలు, వృద్ధుల వరకు ఎవరైనా నిశ్చింతగా వాడవచ్చు. ఊబకాయం, జుట్టు రాలడం, అలర్జీలు, ఆందోళన వంటి సమస్యలకు ఇది మేలైన పరిష్కారం.
అపోహ 4 : అల్లోపతి, హోమియోపతి మందులు కలిపి వాడకూడదా..?
వాస్తవం : ఇది పూర్తిగా అపోహ మాత్రమే. ఇతర వైద్య పద్ధతులతో పాటు హోమియోపతి మందులను నిరభ్యంతరంగా వాడవచ్చు. ఉదాహరణకు మధుమేహం, బీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలకు అల్లోపతి మందులు వాడుతున్న వారు, వాటిని ఆపకుండానే హోమియోపతి చికిత్స తీసుకోవచ్చు. వ్యాధి తీవ్రత తగ్గుతున్న కొద్దీ వైద్యుల సలహాతో అల్లోపతి మందుల మోతాదును క్రమంగా తగ్గించుకోవచ్చు.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com