సాక్షి లైఫ్ : తెలంగాణ రాష్ట్రంలో భానుడి ప్రతాపం రోజురోజుకూ మరింతగా పెరుగుతుండటంతో ప్రజలు పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల ప్రభావంతో ముఖ్యంగా హైదరాబాద్‌లోని ప్రధాన ఆసుపత్రుల్లో జీర్ణకోశ వ్యాధులు, డీహైడ్రేషన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా సికింద్రాబాద్ పరిధిలోని చిల్కలగూడ వంటి ప్రాంతాల్లో కలుషిత నీటి కారణంగా వ్యాధులు ప్రబలుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఆసుపత్రుల వద్ద రోగుల క్యూ..
నగరంలోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రులకు గత వారం రోజులుగా రోగుల తాకిడి 20 శాతం పెరిగింది. తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, శరీరంలో నీటి శాతం తగ్గిపోయి నీరసించిపోయిన బాధితులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
కారణాలు ఇవే..
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ సమస్యలకు ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. చిల్కలగూడ పరిసరాల్లో మురుగునీరు తాగునీటి పైపులైన్లలో కలవడం వల్ల సుమారు 65 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.ఆహారం త్వరగా పాడవ్వడం: అధిక ఉష్ణోగ్రతల వల్ల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల వండిన ఆహారం త్వరగా పాడైపోయి 'ఫుడ్ పాయిజనింగ్'కు దారితీస్తోంది. జీర్ణక్రియపై ప్రభావం: తీవ్రమైన వేడి వల్ల శరీరంలోని జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. ఇది ఎసిడిటీ, మలబద్ధకం లేదా విరేచనాలకు దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ పలు సూచనలు చేసింది. పైపుల ద్వారా వచ్చే నీటిని నేరుగా తాగకుండా, బాగా మరిగించి చల్లార్చిన తర్వాతే తాగాలి. ఆహారం తినే ముందు, తిన్న తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
నిల్వ ఉంచిన పదార్థాలు, బయటి ఆహారం తినకుండా జాగ్రత్త పడాలి.ఓఆర్ఎస్ (ORS)..నీరసంగా అనిపించినా లేదా విరేచనాలు మొదలైనా వెంటనే ఓఆర్ఎస్ ద్రావణం తీసుకోవాలి. ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున, ఏ మాత్రం అస్వస్థతగా అనిపించినా ఆలస్యం చేయకుండా సమీపంలోని వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com