ఫిన్లాండ్‌ ప్రజలు సంతోషంగా ఉండడానికి ప్రధాన కారణాలు..

సాక్షి లైఫ్ : ఫిన్లాండ్‌ జనాభా సంతోషంగా ఉండడానికి అనేక అంశాలున్నాయి. మంచి జీవనశైలి అలవాట్లు, ఆహారపు అలవాట్లు, ప్రకృతిని ఆస్వాదిస్తూ హ్యాపీగా గడపడం వల్లే ఇక్కడి ప్రజలు ఆనందంగా ఉన్నారని యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకీ పరిశోధకురాలు జెన్నిఫర్‌ డీ పావోలా వెల్లడించారు. లైఫ్ లో సక్సెస్ అనే దానిపై ఫిన్లాండ్ ప్రజలకు సరైన అవగాహన ఉంది కాబట్టి. వారందరూ తమ జీవితాలకు సంబంధించిన సక్సెస్ ను సాధిస్తూ చాలా హ్యాపీగా ఉంటారని తెలిపారు.


పోల్చుకోకుండా.. 

ధనికదేశాల ఆర్ధికవ్యవస్థలతో పోల్చుకోకుండా తమకు జీవితంలో ఏమి కావాలో వాటిని అందిపుచ్చుకుంటూ గడిపేస్తారు. అంతేకాదు అవినీతి, ఫ్రీ గా అందించే ఆరోగ్య పథకాలు, విద్యాపథకాలు ఫిన్లాండ్ ప్రజలు హ్యాపీగా ఉండడానికి ప్రధాన కారణాలు. 

తక్కువ వయసు వారే.. 

2006-10 నుంచి అఫ్గానిస్థాన్‌, లెబనాన్‌, జోర్డాన్‌ ప్రజలు సంతోషాన్ని గణనీయంగా కోల్పోయినట్లు నివేదిక తెలిపింది.సెర్బియా, బల్గేరియా, లాత్వియా వంటి దేశాల్లో పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది.పెద్ద వారితో పోలిస్తే తక్కువ వయసు వారే ఆనందంగా ఉన్నట్లు ఈ ఏడాది నివేదిక పేర్కొంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఇది ఒకేరకంగా లేదని తెలిపింది. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో సంతోషం గణనీయంగా తగ్గింది. అక్కడి పెద్దలే ఆనందంగా ఉన్నట్లు తేలింది.

ఇది కూడా చదవండి.. మధుమేహం ఉన్నవాళ్లు ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు.. 


ఐరోపాలో మాత్రం.. 

మధ్య, తూర్పు ఐరోపాలో మాత్రం అన్ని వయసులవారిలో సంతోషం పెరిగినట్లు వెల్లడించింది. పశ్చిమ ఐరోపాలో అందరూ ఒకేరకమైన ఆనంద స్థాయులను అనుభవిస్తున్నట్లు తేలింది. సంతోషకర స్థాయిలో అసమానత ఒక్క ఐరోపా మినహా ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని.. ఇది ఆందోళన కలిగించే విషయమని నివేదిక అభిప్రాయపడింది.


హ్యాపీనెస్ ఇండెక్స్.. 


హ్యాపీనెస్ ఇండెక్స్: 143 దేశాల గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్‌లో ఫిన్లాండ్ వరుసగా ఏడవసారి అగ్రస్థానంలో నిలిచింది. చివరి స్థానంలో ఆఫ్ఘనిస్థాన్‌, 108వ స్థానంలో పాకిస్థాన్‌ ఉన్నాయి. స్థూల దేశీయోత్పత్తి, సోషల్ సపోర్ట్, ఫ్రీడమ్, సేవాగుణం, అవినీతి వంటి అంశాలను ఆధారంగా ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ జాబితాను రూపొందించారు.

గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్‌లో 143 దేశాలలో భారతదేశం 126వ స్థానంలో ఉంది. బుధవారం విడుదల చేసిన ఈ సూచీలో ఫిన్‌లాండ్‌ వరుసగా ఏడోసారి అగ్రస్థానంలో నిలవగా, హమాస్‌తో ఐదు నెలల సుదీర్ఘ యుద్ధం ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ ఐదో స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్యసమితి ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ సందర్భంగా విడుదల చేసిన సూచీలో లిబియా, ఇరాక్, పాలస్తీనా, నైజర్ వంటి దేశాలు భారత్ కంటే దిగువన ఉన్నాయి.

 చివరి స్థానంలో.. 

ఈ సూచీలో ఆఫ్ఘనిస్థాన్ చివరి స్థానంలో ఉండగా, పాకిస్థాన్ 108వ స్థానంలో ఉంది. దీని ప్రకారం, భారతదేశంలోని యువత అత్యంత సంతోషంగా ఉండగా, దిగువ మధ్యతరగతి ప్రజలు సంతోషంగా ఉన్నారు.  

ఎక్కువ వయస్సు గల.. 

60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల భారతీయుల సగటు వృద్ధి రేటు దేశం మొత్తం జనాభా వృద్ధి రేటు కంటే మూడు రెట్లు ఎక్కువ. నివేదిక ప్రకారం.. 2013తో పోలిస్తే సగటు జీవిత మూల్యాంకన వృద్ధిలో  అత్యధిక పెరుగుదల సెర్బియా (37వ స్థానం) బల్గేరియా (81వ స్థానం)లో ఉంది. లైఫ్ అసెస్‌మెంట్ స్కోర్‌లలో అతిపెద్ద పెరుగుదలను చూపుతున్న తర్వాతి రెండు దేశాలు లాట్వియా (46వ స్థానం),కాంగో (89వ) ర్యాంకులు 2013తో పోలిస్తే 44, 40 స్థానాలు పెరిగాయి.

ఇది కూడా చదవండి.. సెలెబ్రెటీలు వేడి నీళ్లు ఎందుకు తాగుతారో తెలుసా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : health happy india finland happy-country happiness-index

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com