సాక్షి లైఫ్ : కరోనా మహమ్మారి తర్వాత, మరికొన్ని వైరస్‌లు, ఇన్‌ఫెక్షన్ల రూపంలో ప్రపంచదేశాలను వణికిస్తూనే ఉన్నాయి. తాజాగా మరొక మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను గడగడలాడిస్తోంది. గతంలోనూ ఈ ప్రమాదకరమైన ఫంగల్ వైరస్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇప్పుడు మరోసారి ఈ ప్రాణాంతక ఫంగస్ కేసులలో గణనీయమైన పెరుగుదలకనిపిస్తోంది. దీనిపేరే.. "కాండిడా ఆరిస్" ఫంగల్ వైరస్. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో కాండిడా ఆరిస్ కేసులలో అకస్మాత్తుగా పెరుగుదల కనిపిస్తోంది. ఈ పెరుగుతున్న కేసుల సంఖ్య ప్రజల ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి 14 సంవత్సరాల తర్వాత ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో మళ్లీ తీవ్రంగా వ్యాపిస్తోంది.
ఇది కూడా చదవండి..Women Outlive Men : ఆయుష్షులో 'ఆడవారే' మేటి.. మగాళ్ల ఆయువు ఎందుకు తగ్గుతోంది..? కేరళ యూనివర్సిటీ షాకింగ్ సర్వే..!
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
కాండిడా ఆరిస్ అంటే ఏమిటి..?
కాండిడా ఆరిస్ (సి. ఆరిస్) అనేది ఒక రకమైన ఫంగల్ వైరస్ కాండిడా ఆరిస్. ఇది తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగించే ఈస్ట్. కాండిడా ఆరిస్ కు చెందిన కొన్ని జాతులు మనుషులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అటువంటివాటిలో కొన్ని ప్రాణాంతకం కూడా కావచ్చు. మనుషుల్లో వ్యాపించే కొన్ని రకాల కాండిడా ఫంగస్‌లో సి. ఆరిస్ ఒకటి.
కాండిడా ఆరిస్ లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఫంగల్ వైరస్ కాండిడా ఆరిస్ రక్తప్రవాహ ఇన్ఫెక్షన్లు, గాయం ఇన్ఫెక్షన్లు, చెవి ఇన్ఫెక్షన్లు వంటి శరీరంలోని వివిధ భాగాలలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. కాండిడా ఆరిస్ లక్షణాలు ఇన్ఫెక్షన్ రకాన్ని బట్టి ఉంటాయి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయి.
కాండిడా ఆరిస్ ఎలా వ్యాపిస్తుంది..?
ఈ ఫంగస్ చర్మంపై, బట్టలపై, ఆసుపత్రి బెడ్లపై ఎక్కువ కాలం జీవించగలదు. కాబట్టి పరిసరాల పరిశుభ్రత చాలా కీలకం. అయితే, ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి కూడా వ్యాపిస్తుంది. కాండిడా ఆరిస్ ఉన్న వ్యక్తుల చర్మ కణాల ద్వారా ఫంగస్ వ్యాప్తి జరుగుతుంది. అందువల్ల దీనిని నివారించడానికి శుభ్రత, పరిశుభ్రత చాలా ముఖ్యమని వైద్యనిపుణులు చెబుతున్నారు.
కాండిడా ఆరిస్ చికిత్స ఏమిటి..?
ఎచినోకాండిన్స్ (Echinocandins).. ప్రస్తుతం కాండిడా ఆరిస్ చికిత్సలో వీటిని 'ఫస్ట్ లైన్' చికిత్సగా పరిగణిస్తారు. ఇవి ఫంగస్ యొక్క కణ కవచాన్ని దెబ్బతీసి దానిని అంతం చేస్తాయి. ఉదాహరణకు: కాస్పోఫంగిన్, మైకాఫంగిన్, అనిడ్యులాఫంగిన్.
లిపోసోమల్ యాంఫోటెరిసిన్ బి (Amphotericin B)..ఒకవేళ ఎచినోకాండిన్స్ పనిచేయకపోతే, వైద్యులు ఈ శక్తివంతమైన మందును సిఫార్సు చేస్తారు. ఇది ఫంగస్‌ను నిర్మూలించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.
కొత్త తరం మందులు (2025 అప్‌డేట్).. ఇటీవల ఎఫ్‌డీఏ (FDA) ఆమోదించిన రెజాఫంగిన్ (Rezafungin) వంటి వారానికి ఒకసారి ఇచ్చే ఇంజెక్షన్లు ఈ చికిత్సలో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. అలాగే మరికొన్ని కొత్త మందులు (Fosmanogepix వంటివి) ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నాయి.
కాండిడా ఆరిస్ ఇన్ఫెక్షన్లు తీవ్రమైనవి, కానీ చాలా సందర్భాలలో చికిత్స అందించినా ఒక్కోసారి సరిగా పనిచేయకపోవచ్చు. ఎచినోకాండిన్స్ అని పిలిచే యాంటీ ఫంగల్ మందులతో చికిత్స అందిస్తారు. మరింత తీవ్రమైన ఇన్ఫెక్షన్ సంభవించినట్లయితే, వైద్యులు సాధారణంగా ఇన్ఫెక్షన్‌ను తొలగించడానికి చాలా ఎక్కువ మోతాదులో యాంటీ ఫంగల్ మందులను ఇస్తారు.
కాండిడా ఆరిస్‌ను నివారించడానికి చిట్కాలు..
ఈ ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉన్నవారిని గుర్తించడానికి కాండిడా ఆరిస్ ఉన్న రోగులను సెపరేట్ గా ఉంచాలి. జనాల్లో కలవనివ్వకూడదు. ఐసోలేషన్ లో ఉంచాలి. రోగిని ప్రత్యేక గదిలో లేదా ఇతర రోగులకు దూరంగా ఉంచండి. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com