సాక్షి లైఫ్ : ప్రస్తుతం కేరళలో 'హెపటైటిస్-ఏ' (Hepatitis A) కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపించే ఈ వైరస్ కారణంగా ఇప్పటికే పలువురు మృతి చెందగా, వేల సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల పాలవుతున్నారు. ముఖ్యంగా మలప్పురం, ఎర్నాకుళం, కోజికోడ్, త్రిసూర్ జిల్లాల్లో ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
హెపటైటిస్ "ఏ" అంటే..?
ఇది కాలేయం (Liver) మీద దాడి చేసే ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సుమారు 14 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాలు చెబుతున్నాయి. ఇది ప్రాణాంతకం కాకపోయినా, సరైన సమయంలో చికిత్స అందకపోతే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది.
ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయంటే..?
ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 2 నుంచి 4 వారాల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన నీరసం.. ఏ పని చేయలేనంతగా అలసిపోవడం. కామెర్లు (Jaundice).. కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడం, మూత్రం ముదురు పసుపు రంగులో రావడం. జీర్ణక్రియ సమస్యలు.. ఆకలి మందగించడం, వికారం, వాంతులు, కడుపు నొప్పి. స్వల్పం నుంచి తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు.
ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే..?
కలుషిత నీరు.. వైరస్ ఉన్న నీటిని తాగడం లేదా ఆ నీటితో చేసిన పానీయాలు సేవించడం. అపరిశుభ్ర ఆహారం.. ఈగలు వాలిన, కలుషితమైన రోడ్డు పక్కన అమ్మే ఆహార పదార్థాల ద్వారా హెపటైటిస్-ఏ వ్యాపించే ప్రమాదం ఉంటుంది.
పరిశుభ్రత లోపం.. మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
నివారణా చర్యలు..?
వైద్య నిపుణులు సూచిస్తున్న ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా హెపటైటిస్-ఏ నుంచి రక్షణ పొందవచ్చు. నీటిని మరిగించి తాగాలి.. కేవలం ఫిల్టర్ చేసిన నీటిపైనే ఆధారపడకుండా, నీటిని బాగా మరిగించి చల్లార్చుకుని తాగడం సురక్షితం. చేతుల శుభ్రత.. భోజనానికి ముందు, మరుగుదొడ్లు వాడిన తర్వాత సబ్బుతో చేతులను కనీసం 20 సెకన్ల పాటు శుభ్రం చేసుకోవాలి.
బయటి ఆహారం వద్దు.. ముఖ్యంగా ఐస్ వేసిన పండ్ల రసాలు (Juices), కట్ చేసిన పండ్లు, రోడ్డు పక్కన అమ్మే తినుబండారాలకు దూరంగా ఉండాలి. టీకా (Vaccination).. హెపటైటిస్-ఏ నివారణకు సమర్థవంతమైన టీకాలు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సలహా మేరకు వీటిని తీసుకోవడం ఉత్తమం. ఈ లక్షణాలు కనిపిస్తే సొంతంగా వైద్యం చేసుకోకుండా, ఆలస్యం చేయకుండా వైద్యునిపుణులను సంప్రదించడం ఉత్తమం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com