HIV Control : హెచ్‌ఐవీ నియంత్రణలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్, 31 జిల్లాలకు ‘సురక్షిత్‌’ హోదా..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ :హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌(HIV/AIDS) నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (NACO) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మొబిలైజేషన్‌ ఫర్‌ ఎయిడ్స్‌ సురక్ష’ (MAS) కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 31 జిల్లాలు ‘సురక్షిత్‌’ హోదాను దక్కించుకున్నాయి. నవంబరు 25, 2026 నాటి జాతీయ గణాంకాల ప్రకారం 94 శాతం విజయంతో తెలంగాణ అగ్రస్థానంలో నిలవగా, మహారాష్ట్ర (92%), పశ్చిమ బెంగాల్‌ (83%), అరుణాచల్‌ ప్రదేశ్‌ (74%), తమిళనాడు (71%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.   

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

 


 ‘సురక్షిత్‌’ జాబితాలో..

దేశవ్యాప్తంగా ఉన్న 784 జిల్లాల్లో కేవలం 273 జిల్లాలు (35%) మాత్రమే ‘సురక్షిత్‌’ జాబితాలో చోటు దక్కించుకోగా, తెలంగాణ సాధించిన ఈ ప్రగతి విశేషంగా నిలిచింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘సోచ్‌’ (SOCH) డిజిటల్‌ వేదిక ద్వారా హెచ్‌ఐవీ పరీక్షలు, చికిత్స, నివారణ చర్యలను పర్యవేక్షిస్తోంది.   
 

లక్ష్యాల సాధన..

హెచ్‌ఐవీ బాధితుల్లో 95 శాతం మందిని గుర్తించడం, వారిలో 95 శాతం మందికి ఏఆర్‌టీ (ART) చికిత్స అందించడం, చికిత్స పొందుతున్న వారిలో 99 శాతం మందిలో వైరస్‌ను నియంత్రించడం (95:95:99) లక్ష్యంగా జిల్లాలను అంచనా వేస్తారు. ఈ మూడు లక్ష్యాలను చేరుకున్న జిల్లాలను ‘సురక్షిత్‌’గా, రెండింటిని చేరుకున్న వాటిని ‘సక్షం’గా, మిగిలిన వాటిని ‘సంఘర్షశీల్‌’గా వర్గీకరిస్తారు.   
 

ఈ అద్భుత విజయాన్ని సాధించిన వైద్యారోగ్య శాఖ అధికారులు, వైద్యులు, టీజీఎస్‌ఏసీఎస్‌ (TGSACS) సిబ్బంది, జిల్లా కలెక్టర్లను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేకంగా అభినందించారు. మిగిలిన రెండు జిల్లాలపైనా ప్రత్యేక దృష్టి సారించి, రాష్ట్రంలోని అన్ని జిల్లాలను ‘సురక్షిత్‌’ జాబితాలోకి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు.   
 

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.