మళ్ళీ విజృంభిస్తున్న జికా వైరస్.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ

సాక్షి లైఫ్ : మహారాష్ట్రలోని నాసిక్‌లో జికావైరస్‌ కలకలకం రేపుతోంది. ఇటీవలే 24 ఏళ్ల యువకుడు ఒకరు ఈ ప్రాణాంతక వైరస్‌ బారిన పడినట్లు స్పష్టం కావడం దీనికి కారణం  ప్రస్తుతం ఆ యువకుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా వైరస్‌ బారిన పడ్డ యువకుడు నివసించే ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఐదుగురు గర్భిణులకు  రక్త పరీక్షలు నిర్వహించారు. నమూనాలను పూణెలోని పరిశోధనశాలకు పంపించారు. 

జికావైరస్ వ్యాధి లక్షణాలు కూడా డెంగీని పోలి ఉంటాయి. రెండు నుంచి ఏడు రోజుల వరకు ఈ లక్షణాలు కనిపిస్తూంటాయి.  

రక్త నమూనాలను.. 

నాసిక్ లో జికా వైరస్ సోకిన వ్యక్తిని భరత్‌నగర్‌ కు చెందినవాడిగా గుర్తించారు. నగరపాలక సంస్థ వైద్య యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. జికా వైరస్ కారణంగా గర్భిణీ స్త్రీలకు ఎక్కువ ప్రమాదం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. గర్భిణులకు జికా సోకితే గర్భంలోని శిశువు  లోపాలతో పుట్టే అవకాశాలు ఎక్కువవుతాయి. అందుకే జికా రోగిని గుర్తించిన ప్రాంతంలో గర్భిణులను గుర్తించి వారి రక్త నమూనాలను పరీక్షలకు  మున్సిపల్ కార్పొరేషన్ మెడికల్ ఆఫీసర్, నర్సులు తదితరులు క్యాంపస్‌లో ఈ తనిఖీ చర్యలు నిర్వహించారు.  

గర్భిణులకు రక్షణ కల్పించేందుకు.. 

మునిసిపల్ కార్పొరేషన్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ తానాజీ చవాన్ మాట్లాడుతూ.. నాసిక్ లోని భరత్ నగర్ కాంప్లెక్స్‌లో జికా వైరస్ కేసు నమోదైందని, గర్భిణులకు రక్షణ కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఐదుగురు గర్భిణీల రక్త నమూనాలను పూణెలోని ల్యాబొరేటరీకి పంపినట్లు ఆయన పేర్కొన్నారు.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
 

Tags : nashik-alert

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com