ఆరోగ్యాన్ని అందించే బియ్యం..  

సాక్షి లైఫ్ : తెలుగు రాష్ట్రాల్లో తెల్ల బియ్యం వినియోగమే కనిపిస్తుంది. కానీ, రైస్ లోనూ చాలా రకాలు ఉన్నాయి. రంగు, రుచి, పోషకాలు ఇలా ఎన్నో వ్యత్యాసాలు ఆయా బియ్యంరకాలలో కనిపిస్తాయి. కొన్నింటిలో ఫైబర్ తోపాటు ఇతర పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. ఇప్పుడు హెల్తీగా ఉంచే బియ్యం గురించి తెలుసుకుందాం..  

బ్రౌన్ రైస్.. 

ముడి బియ్యం..వీటినే "బ్రౌన్ రైస్" అని కూడా అంటారు. అంటే పాలిష్ పట్టనివి. తెల్ల బియ్యంలా కాకుండా బ్రౌన్ రైస్ పైన గోధుమరంగులో పొర  ఉంటుంది. ఈరకం బియ్యంలో అనేక పోషకాలు ఉంటాయి. బ్రౌన్ రైస్ పై పొర బ్రాన్ లో ఫ్లావనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు అయిన అపిజెనిన్, క్వెర్సెటిన్, ల్యుటెలిన్ ఉంటాయి. 

వ్యాధులపై పోరాడడంలో.. 

వ్యాధులపై పోరాడడంలో ఈ యాంటీ ఆక్సిడెంట్ల పాత్ర ఎంతో కీలకం. ఇలా ప్లావనాయిడ్స్ సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని నిత్యం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, కేన్సర్ తదితర తీవ్ర వ్యాధుల రిస్క్ తగ్గుతుంది. 
వైట్ రైస్ మాదిరే కార్బొహైడ్రేట్లు, కేలరీలు బ్రౌన్ రైస్ లోనూ ఉంటాయి. మనం తీసుకునే వైట్ రైస్ రకాల్లో గోధుమపొర లేనివే ఎక్కువగా ఉంటున్నాయి.

వైట్ రైస్ కు బదులు బ్రౌన్ రైస్..
 
బ్రౌన్ రైస్ లో మూడు రెట్లు అధిక పీచుతోపాటు, ప్రొటీన్ కూడా లభిస్తుంది. పీచు, ప్రొటీన్ రెండూ కూడా వెంటనే ఆకలి కలిగించవు. బరువును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వైట్ రైస్ కు బదులు బ్రౌన్ రైస్ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

 బ్లాక్ రైస్.. 

బ్లాక్ రైస్ లోనూ పలు రకాలున్నాయి. ఇండోనేషియన్ బ్లాక్ రైస్, థాయ్ జాస్మిన్ బ్లాక్ రైస్ అన్నవి మరీ నల్లగా ఉంటాయి. వండినప్పుడు ఈ బియ్యం అన్నం పర్పుల్ రంగులో కనిపిస్తుంది . దీన్నే ఫర్ బిడెన్ రైస్ అని కూడా అంటుంటారు. మరే ఇతర రకంలో లేనన్ని యాంటీ ఆక్సిడెంట్లు బ్లాక్ రైస్ లో లభిస్తాయి. 

యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు కలిగిన ఫ్లావనాయిడ్ ప్లాంట్ పిగ్మెంట్లు మరింతగా ఉంటాయి. యాంథోసియానిన్స్ అన్నవి కేన్సర్ పై పోరాడే గుణాలను కలిగి ఉంటాయి. యాంథోసియానిన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే కొన్ని రకాల కేన్సర్ రిస్క్ తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. బ్రెస్ట్ కేన్సర్ కణాలను అణచివేయడంలోనూ యాంథోసియానిన్స్ పనిచేస్తున్నట్టు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 

రెడ్ రైస్.. 

 హిమాలయన్ రెడ్ రైస్, థాయ్ రెడ్ కార్గో రైస్ లో పోషకాలు దండిగా ఉంటాయి. వీటిల్లో ప్రొటీన్, ఫైబర్, ఫ్లావనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు  ఉన్నాయి. శరీర అవయవాల్లో ఉండే వాపు గుణాన్ని ఫ్లావనాయిడ్స్ తగ్గిస్తాయి. 

డయాబెటిస్ రిస్క్.. 

హానికారకాలను బయటకు పంపించేస్తాయి. దాంతో గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం రిస్క్ తగ్గుతుంది. వైల్డ్ రైస్ వీటిలో అధిక ప్రొటీన్, వైట్ రైస్ తో పోలిస్తే మూడు రెట్లు అధికంగా ఫైబర్ లభిస్తుంది. జంతువులపై చేసిన పరిశోధనల్లో వైల్డ్ రైస్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్టు తెలిసింది. ఇన్సులిన్ నిరోధకత, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను కూడా తగ్గిస్తుంది. 

ఇది కూడా చదవండి.. కర్డ్ రైస్ తో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : healthy-food red-rice brown-rice black-rice
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com