మంచి పుచ్చకాయను ఎలా గుర్తించాలి..?  

సాక్షి లైఫ్ : కొన్ని లక్షణాలను బట్టి కొన్ని కాయలు, పండ్లుమంచివా..?  కావా..? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. పుచ్చకాయను కూడా ఎలాంటి లక్షణాలుంటే మంచిది అని డిసైడ్ అవ్వొచ్చు. వాటిని కొనుగోలు చేసేటప్పుడు ఈ గుర్తులను తప్పనిసరిగా చూసి కొనాలి.. లేకపోతే మోసపోతారు.

డీహైడ్రేష‌న్ నుంచి ఉపశమనం..  
 
వేసవికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే పండ్ల‌లో పుచ్చ‌కాయ‌ ప్రధానమైంది. వేస‌వి తాపాన్ని త‌గ్గించి, శ‌రీరానికి ఉత్తేజాన్ని ఇవ్వ‌డంలో వీటిని మించి మ‌రొక‌టి లేద‌నే చెప్పొచ్చు. 95 శాతం వ‌ర‌కు నీరే ఉన్న ఈ పండును తిన‌డం వ‌ల్ల డీహైడ్రేష‌న్ నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. అందుకే స‌మ్మ‌ర్ వ‌చ్చిందంటే వీటికి గిరాకీ బాగుంటుంది. అయితే వీటిలో ఎలాంటి కాయ‌ల‌ను కొనాలి..? ఏవి ఎర్ర‌గా, మంచి రుచితో ఉంటాయో చాలా మంది గుర్తించ‌లేరు. దీంతో అమ్మేవాళ్లు చెప్పిన కాయ‌లు కొని ఒక్కోసారి మోస‌పోతుంటారు.

ఇది కూడా చదవండి.. ఉపవాసం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. 

 ఆడ‌, మ‌గ జాతులు.. 

అందుకే పుచ్చ‌కాయ‌ల‌ను కొనేముందు ఈ చిట్కాలు ఫాలో అయితే మంచి కాయ‌ను కొనుక్కోవ‌చ్చు. పుచ్చ‌కాయ‌లో ఆడ‌, మ‌గ జాతులు కూడా ఉంటాయి. ఆడ పుచ్చ‌కాయ‌లు చిన్న‌గా, గుండ్రంగా ఉంటాయి. మ‌గ పుచ్చ‌కాయ‌లు పొడుగ్గా, కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. వీటిలో నీటి శాతం, గుజ్జు ఎక్కువ‌గా ఉంటుంది. అదే తియ్య‌టి కాయ కావాలంటే ఆడ‌పుచ్చ కాయను తీసుకోవడం మేలు.

ప‌రిమాణానికి సంబంధం లేదు.. 

 పుచ్చ‌కాయ ఎంత పెద్ద‌గా ఉంటే అంత బాగుంటుంద‌ని చాలామంది అపోహ ప‌డ‌తారు. కానీ అది నిజం కాదు.. పుచ్చ‌కాయ రుచికి దాని ప‌రిమాణానికి సంబంధం లేదు. కాయ ఏ సైజ్‌లో ఉన్నా స‌రే.. ప‌ట్టుకున్న‌ప్పుడు బ‌రువుగా ఉండాలి. అలా బ‌రువుగా ఉంటే కాయ లోప‌ల నీళ్లు, గుజ్జు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అర్థం చేసుకోవ‌చ్చు. అందుకే ఎప్పుడూ సాధార‌ణ సైజ్‌లో ఎక్కువ బ‌రువు ఉన్న కాయ‌ల‌నే ఎంచుకోవాలి.

అలాంటి కాయ‌లు.. 

చాలామంది ప‌చ్చ‌గా క‌నిపించే పుచ్చ‌కాయ‌ల‌ను కొంటుంటారు. అవి తాజాగా ఉంటాయ‌ని అనుకుంటారు. కానీ అలాంటి కాయ‌లు పూర్తిగా పండ‌క‌.. చ‌ప్ప‌గా అనిపిస్తుంటాయి. నిజానికి పూర్తిగా పండిన పుచ్చ‌కాయ ముదురు ప‌చ్చ రంగులో ఉంటుంది. అలాంటి కాయ‌లే రుచిగా ఉంటాయి. 

కొన్ని పుచ్చ‌కాయ‌ల‌పై ఒక‌వైపు తెలుపు, గోధుమ రంగు మ‌చ్చ‌లు చూసే ఉంటారు. ఈ మ‌చ్చ‌లు ఎంత ముదురు రంగులో ఉంటే ఆ కాయ అంత రుచిగా ఉంటుంది. కొన్ని కాయ‌ల‌పై పిచ్చి గీత‌లు గీసిన‌ట్లు గోధుమ రంగు మ‌చ్చ‌లు ఉంటాయి. ఈ కాయ‌లు చాలా రుచిగా ఉంటాయి. ఈ మ‌చ్చ‌లు కూడా తేనెటీగ‌లు ప‌దే ప‌దే వాల‌డం వ‌ల్ల ఏర్ప‌డ‌తాయట‌. 

కాయ రుచి.. 

పుచ్చ‌కాయ తొడిమ‌ను చూసి కూడా కాయ రుచి ఎలా ఉంటుందో చెప్పొచ్చు. తొడిమ ఎండిపోయిన‌ట్లు ఉంటే ఆ కాయ బాగా పండింద‌ని అర్థం. అలా కాకుండా తొడిమ ప‌చ్చిగా ఉంటే ఇంకా ఆ కాయ పండ‌లేద‌నే చెప్పొచ్చు. పుచ్చ‌కాయ‌ను కొనేముందు దానిపై వేళ్ల‌తో కొట్ట‌డం ద్వారా ఆ కాయ ఎలాంటిదో క‌నుక్కోవ‌చ్చు. పుచ్చ‌కాయ‌ను వేళ్ల‌తో కొట్టిన‌ప్పుడు ట‌క్ ట‌క్ అని శ‌బ్దం వ‌స్తే ఆ కాయ బాగా పండింద‌ని చెప్పొచ్చు.
 
శ‌బ్దం రాక‌పోతే.. 

అదే శ‌బ్దం రాక‌పోతే ఆ కాయ ఇంకా పండాల్సి ఉంద‌ని అర్థం పుచ్చ‌కాయ‌ను ముక్కు ద‌గ్గ‌ర పెట్టుకుని వాస‌న చూసిన‌ప్పుడు తియ్య‌టి వాస‌న వ‌స్తుంది. తియ్య‌గా వ‌స్తే మాత్రం ఆ కాయ‌ను తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది. ఎందుకంటే ఆ కాయ బాగా పండి మురిగిపోయేందుకు సిద్ధంగా ఉంద‌ని మనం గ్రహించాలి. పుచ్చకాయ కొనుగోలు చేసేటప్పుడు ఇలాంటి లక్షణాలు న్నాయోలేదో చూసుకొని కొనాలి..లేకపోతే మోసపోవాల్సి వస్తుంది.  

ఇది కూడా చదవండి.. New study : మీ బెడ్ రూమ్ ఎంత సేఫ్ ..? పిల్లో కవర్‌లో మిలియన్ల కొద్దీ బ్యాక్టీరియాలు..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : healthy-food summer-health-tips summer-season summer symtoms dehydration watermelon good-fruit

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com