ఆటిజంను ప్రారంభ దశలో గుర్తించవచ్చా..? 

షేర్ చేయండి:
ఆటిజంను ప్రారంభ దశలో గుర్తించవచ్చా..? 

సాక్షి లైఫ్ : ఆటిజంను మొదటి దశలోనే గుర్తింవచ్చని కొత్త మెషిన్ లెర్నింగ్ మోడల్ ద్వారా నిరూపించింది కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూటెట్‌. ఇటీవల దీనిపై  కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూటెట్‌ ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. ఇక నుంచి ఆటిజంను ఆర్టిఫిషయల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)మోడల్ ద్వారా గుర్తించనున్నారు. రెండు సంవత్సరాల వయసు లోపు చిన్నారుల్లో ఈ మోడల్‌ ఖచ్చితత్వంతో ఆటిజమ్‌ను అంచనా వేయడం ద్వారా వైద్య రంగంలో ఎంతో విలువైన పరికరంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. 

ఇది కూడా చదవండి.. అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి.. చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

 ఎలాంటి అనారోగ్య సమస్యనైనా ముందుగా గుర్తిస్తే సులువుగా అది ఎక్కువ అవ్వకముందే జాగ్రత్త పడొచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.. సరైన చికిత్స తీసుకుంటే ఆయా సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చని కూడా వారు చెబుతున్నారు. అందుకోసమే కొంతమంది పరిశోధకులు అలాంటి కొన్నిరకాల వ్యాధులపై నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా చిన్నారుల విషయంలో ఎదుర్కొనే ఆటిజంను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. 


ఓ అధ్యయనంలో భాగంగా ఆటిజమ్‌ లక్షణాలు కలిగిన, అస్సలు అటువంటి లక్షణాలే లేని సుమారు మూడు వేల మందిపై పరిశోధన చేశారు. వేర్వేరు ప్రమాణాలను విశ్లేషించి, నాలుగు మెషిన్‌ లెర్నింగ్‌ మోడళ్లను తయారు చేశారు. అటువంటివాటిల్లో ‘ఆట్‌మెడ్‌ఏఐ’ అనే మోడల్‌ అన్నింటికంటే  ఉత్తమమైన ఫలితాలను అందించింది. 

 
అంచనా వేవేసేందుకు.. 

ఇందులో సుమారు 12వేల మంది నుంచి 80శాతం ఖచ్చితత్వంతో ఆటిజమ్‌ పిల్లలను కనుగొనగా, ఆటిజమ్‌ను అంచనా వేవేసేందుకు మొదటిసారిగా నవ్వడం, మొదటిసారిగా చిన్న పదాలు పలకడం, ఆహారం  సరిగా తినలేకపోవడం వంటి లక్షణాలను ప్రమాణాలు తీసుకోవడం  విశేషం. 

ఆటిజమ్‌.. 

సమాచారం పెద్దగా అందుబాటులో లేకపోయినా ఆటిజమ్‌ వచ్చే అవకాశాలు ఉండేవారిని ఈ సరికొత్త మోడల్‌ సాయంతో గుర్తించడానికి  వీలుకలుగుతుందని అధ్యయనం నిర్వహించిన బృందానికి నాయకత్వం వహించిన శ్యామ్‌ రాజగోపాలన్‌ వెల్లడించారు. ఆటిజమ్‌ను త్వరగా గుర్తించటం, చికిత్స విషయంలో ఇది గణనీయమైన మార్పులు తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి.. అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించే ఆహారం..


ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు.

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.