సాక్షి లైఫ్ : దంతాలు మంచిగా ఉంటేనే కదా ఆహారాన్ని చక్కగా నమిలి మింగగలిగేది. బాగా నమిలినప్పుడే కదా..? ఆహారం జీర్ణమవ్వడానికి సిద్ధమయ్యేది. అలా ఆహారం జీర్ణమైనప్పుడే కదా శక్తి విడుదలయ్యేది. అప్పుడే కదా ఆరోగ్యంగా ఉండి దైనందిన కార్యక్రమాలను నిర్వర్తించగలుగుతాం. కాబట్టి దంతాలను మనం ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటాము. చర్మ సంరక్షణ కోసం చేయాల్సినవి .. చేయకూడని పనులను గురించి తెలుసుకుందాం..!
దంత సమస్యలు.. వాస్తవాలు..
గ్లోబల్ ఓరల్ హెల్త్ స్టేటస్ రిపోర్ట్ (2022) అంచనా ప్రకారం ఓరల్ ప్రాబ్లమ్స్ తో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 350కోట్ల మంది ప్రజలు బాధపడుతున్నారు. వెనుకబడిన దేశాల్లో నలుగురిలో ముగ్గురు దంత సంబంధిత సమస్యల బారీన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా200 కోట్లమంది ప్రజలు దంతాల క్షయంతో ఇబ్బంది పడుతున్నారు. 51.4 కోట్ల మంది పిల్లలు ప్రాథమిక దంత క్షయంతో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..మినరల్ వాటర్ పై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ప్రకటన..
ఇది కూడా చదవండి..ఏవియన్ ఫ్లూ న్యూ వేరియంట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..?
ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
అవగాహన అవసరం..
చూడటానికి, తెల్లగా, గట్టిగా ఉండే దంతాలను సంరక్షించుకుంటేనే అవి ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటాయి. వీటి సంరక్షణ ఆవశ్యకత అర్థం కావాలంటే ముందు వాటి నిర్మాణంపై అవగాహన అవసరం. దంతంపై భాగం ఎనామిల్ అనే పదార్థంతో ఏర్పడుతుంది. ఎనామిల్ తర్వాత డెంటిన్ అనే మరో పొర ఉంటుంది. డెంటిన్ తరువాత పల్ప్ కనిపిస్తుంది.
చిగుళ్లు ఎంత ఆరోగ్యంగా ఉంటే..?
ప్రతి దంతానికి దవడలో మూలం ఉంటుంది. ఎన్ని పండ్లుంటే అన్ని మూలాలు దవడ ఎముకలో ఉంటాయి. ఈ దంతాల చుట్టూ చిగురు ఆవరించి ఉండి సిమెంట్ లాగా పనిచేస్తుంది. చిగుళ్లు ఎంత ఆరోగ్యంగా ఉంటే దంతాలు కూడా అంత గట్టిగా ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోకపోతే వాచిపోయి దుర్వాసన వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
చిగుళ్ల వాపు వల్ల..
ఎదుటివాళ్లతో మాట్లాడేటప్పుడు మన నోటి నుంచి భరించలేని వాసన వస్తుంది. ఫలితంగా చాలామంది మనల్ని తప్పించుకుని తిరిగే ప్రమాదమూ ఉంటుంది. చిగుళ్ల వాపువల్ల రక్తస్రావం కూడా కలుగుతుంది. ఇంకా నిర్లక్ష్యం చేస్తే దంతాలు కదలడం ప్రారంభమవుతుంది.
ఏదైనా తిన్న తర్వాత..
దంతాలు వచ్చినా, రాకపోయినా శిశువులు పాలు తాగిన తర్వాత నోరంతా శభ్రంగా కడగాలి. వేలితో చిగుళ్లను మర్దన చేయాలి. పాల సీసా పీకను నోట్లోనే ఉంచి నిద్రపుచ్చకూడదు. ఏదైనా తిన్న తర్వాత పుక్కిలించి ఊయడం, నోటిని శుభ్రం గా కడుక్కోవడం వంటి పనులను పిల్లలకు అలవాటు చేయాలి. పిల్లలకు శాస్త్రీయంగా ఎలా పండ్లు తోమాలో తల్లిదండ్రులే దగ్గరుండి నేర్పించాలి.
ప్రతి మూడు నెలలకోసారి..
కిందిపండ్లు పైకి, పై పండ్లు కిందికి బ్రష్ చేయాలి. పెద్దలు వాళ్ళు కూడా బ్రష్‌ని ప్రతి మూడు నెలలకోసారి మార్చాలి. పంటి నొప్పి లేదా చిగురు వాపు వస్తే దంతానికి జందూబామ్ లేదా అమృతాంజన్ వంటివి రాయకూడదు. పంటి సందుల్లో పుల్లలు, పిన్సీసులు వంటివి పెట్టి కెలకకూడదు. పాన్, గుట్కా ఇతర పొగాకు ఉత్పత్తులను నమలకూడదు.
గరుకైన పొడులను, గట్టిగా ఉండే బ్రష్‌లను దంతాలు శుభ్రంచేయడానికి ఉపయోగించకూడదు. అతి చల్లగా కానీ లేదా అతి వేడిగా ఉండే పదార్థాలను, పానీయాలను పంటికి తగలకుండా జాగ్రత్తపడితే మంచిది. దంతాలకు వైద్యం చేయించు కుంటే చూపు మందగి స్తుందని చాలామంది అనుకుంటారు.
పంటి నరాలకు, కంటి నరాలకు..
ఇది పెద్ద అపోహ.. పంటి నరాలకు, కంటి నరాలకు సంబంధమే లేదు. దంతాలు పుచ్చిపోవడానికి పురుగులు కారణం అనుకుంటారు. అది కూడా తప్పే. దంతాలు పుచ్చిపోవడానికి అసలు కారణం సూక్షజీవులు.
బ్యాడ్ స్మెల్..
దంతాలను, చిగుళ్లను అన్ని వైపులా శుభ్రంచేసుకోక పోవడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. మనం తిన్న ఆహారం పండ్లలో ఇరుక్కుపోయి కుళ్లిపోయి దంత సమస్యలు వస్తాయి. అందుకే చిగుళ్లు వాయడం, రక్తంకారడం జరుగుతుంది.
పళ్లు పుచ్చిపోవడం..
పళ్లు పుచ్చిపోవడం మరో సమస్య. దంతాల పుచ్చు ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయించుకోవాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మధుమేహం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండకపోతే మరింత ప్రమాదం. కాబట్టి దంత సంరక్షణలో అవసరమైన జాగ్రత్తలు పాటించి ఆగ్యంగా ఉండండాలని డెంటిస్టులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..కార్డియో వాస్క్యూలర్ డిసీజెస్ కు కారణాలు..? పరిష్కారాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com