అసలు నులి పురుగులు చిన్నారుల్లోనే ఎందుకు వస్తాయి..?
సాక్షి లైఫ్: చిన్నారుల్లో అనేక ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణంగా నులిపురుగులు ఉన్నాయి. ఈ పురుగుల నుంచి పిల్లలను కాపాడుకోవడానికి ఆల్బెండజోల్ మాత్రలు వేయడం చాలా ముఖ్యం. నులిపురుగులు పిల్లల పొట్టలోకి చేరి వారి ఎదుగుదలను అడ్డుకోవడమే కాకుండా, రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలను కలిగిస్తాయి. ఈ సమస్యలను నివారించేందుకు సంవత్సరానికి రెండుసార్లు ఆల్బెండజోల్ మాత్రలను పిల్లలకు ఇవ్వాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 రోజువారీ అలవాట్లు..
ఇది కూడా చదవండి..20 ఏళ్లలోపు వారికే గుండెపోటు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణాలు..
ఇది కూడా చదవండి..బాడీ బిల్డింగ్ కోసం ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా..?
నులిపురుగుల ప్రభావం పిల్లల ఆరోగ్యంగాపై తీవ్రంగా చూపిస్తుంది. అంతేకాదు ఇవి పిల్లల శారీరక, మానసిక పెరుగుదలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. రక్తహీనత, పోషకాల లోపం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, బలహీనంగా మారడం, తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు అవుతాయి.
ఈ సమస్యల కారణంగా పిల్లలు చదువుపై ఏకాగ్రత చూపలేరు. ఆల్బెండజోల్ మాత్ర వేసుకోవడం ద్వారా వీటిని నిర్మూలించవచ్చు. వీటి వల్ల ఇమ్మ్యూనిటీ పెరుగుతుంది. అందుకోసమే పిల్లలందరూ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఏడాది వయసున్న పిల్లలతోపాటు19 ఏళ్ల వయసున్న వారికి కూడా ఆల్బెండజోల్ టాబ్లెట్స్ తప్పనిసరిగా అందించాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఆల్బెండజోల్ మాత్రలు అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు తిరిగి వైద్య సిబ్బంది పంపిణీ చేస్తుంటారు. 1నుంచి19 ఏళ్ల వయసున్నవారికి నులిపురుగుల మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
1నుంచి 2 ఏళ్ల లోపు చిన్నారులకు ఆల్బెండజోల్ 400 ఎంజీ సగం మాత్ర, 3నుంచి19 ఏళ్లలోపు వారికి 400 ఎంజీ ఫుల్ టాబ్లట్ వేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
అసలు నులి పురుగులు ఎందుకు వస్తాయి..? పిల్లల్లో నులిపురుగులు రావడానికి ప్రధాన కారణం శుభ్రత లేకపోవడమే. దుమ్ము, ధూళి, మట్టిలో ఆడుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం వల్ల నులి పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకోసమే పిల్లల చేతిగోర్లను శుభ్రంగా ఉంచేలా తల్లిదండ్రులు చూసుకోవాలి.
భోజనం చేసేటప్పుడు, మూత్ర, మల విసర్జన అనంతరం చేతులు శుభ్రం చేసుకోవడం పిల్లలకు నేర్పించాలి. పిల్లలు మట్టి, బురదలో ఆడుకున్న తర్వాత శుభ్రంగా స్నానం చేయించాలి. ఆదుకునే సమయంలోకూడా పలు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
