Causes of Intestinal Worms : చిన్నారుల్లో అసలు నులిపురుగులు ఎందుకు వస్తాయి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చిన్నారుల ఎదుగుదలకు, వారి చదువుకు అడ్డుపడుతున్న ప్రధాన శత్రువుల్లో ఒకటి 'నులిపురుగులు' వీటినే నట్టలు అనికూడా అంటారు. ఈ పురుగులు పిల్లల పొట్టలో చేరి, వారు తినే ఆహారంలోని పోషకాలను లాగేసుకుంటాయి. దీనివల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా బలహీనపడటమే కాకుండా.. రక్తహీనత, తీవ్రమైన కడుపునొప్పి వంటి సమస్యల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో నులిపురుగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యుల సూచనలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

 అసలు నులిపురుగులు ఎందుకు వస్తాయి..? 

పిల్లల్లో ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం పరిశుభ్రత లోపించడమేనని వైద్యులు చెబుతున్నారు. దుమ్ము, ధూళి, మట్టి లేదా బురదలో పిల్లలు ఆడుకోవడం వల్ల వాటిలోని సూక్ష్మ గుడ్లు చేతి గోర్లలోకి చేరుతాయి. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం వల్ల కూడా ఇవి వేగంగా వ్యాపిస్తాయి. చేతులు సరిగ్గా కడుక్కోకుండా ఆహారం తినడం వల్ల ఆ గుడ్లు నేరుగా కడుపులోకి వెళ్లి నులిపురుగులుగా మారుతాయి.

పిల్లలపై చూపే దుష్ప్రభావాలు ఇవే..

విపరీతమైన కడుపునొప్పి, విరేచనాలు.ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, నిస్సత్తువ. రక్తహీనత (anemia), తీవ్ర పోషకాహార లోపం.రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) క్షీణించడం.శారీరక, మానసిక ఎదుగుదల మందగించడం వల్ల చదువుపై ఏకాగ్రత దెబ్బతినడం.ఏ వయసు వారికి.. ఎంత మోతాదు ఇవ్వాలి..? వైద్య నిపుణుల ప్రకారం.. 1 సంవత్సరం నుంచి 19 ఏళ్ల వయసు ఉన్నవారందరూ ఏడాదికి రెండుసార్లు తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు ఆల్బెండజోల్ వేసుకోవాలి. ఆల్బెండజోల్ (Albendazole 400 mg) మోతాదు1 నుంచి 2 ఏళ్ల లోపు..సగం మాత్ర (200 mg). 3 నుంచి 19 ఏళ్ల లోపుఒక పూర్తి మాత్ర (400 mg).

ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ/ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల ద్వారా ఈ మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తుంటారు. ఆల్బెండజోల్ మాత్రల వల్ల ప్రయోజనాలు..ఈ మాత్రలు వేసుకోవడం వల్ల కడుపులోని నులిపురుగులు పూర్తిగా నశించిపోతాయి. ఫలితంగా పిల్లల్లో పోషకాల గ్రహణ శక్తి పెరిగి, రక్తహీనత తగ్గుతుంది. తద్వారా రోగనిరోధక శక్తి పెరిగి పిల్లలు చురుగ్గా, ఆరోగ్యంగా ఎదుగుతారు. 

తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

పిల్లల చేతిగోర్లను ఎప్పటికప్పుడు క్రమంగా కత్తిరిస్తూ, శుభ్రంగా ఉంచాలి.భోజనానికి ముందు, అలాగే మలమూత్ర విసర్జన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేయాలి. పిల్లలు బయట మట్టిలో ఆడుకుని రాగానే కాళ్లు, చేతులు శుభ్రం చేసి, వీలైతే స్నానం చేయించాలి. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకే, వైద్యుల సూచనల మేరకు మీ పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించి, వారిని ఆరోగ్యంగా ఉంచండి.

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.