Ghaziabad Incident : చిన్నారుల ప్రాణాలు కబళిస్తున్న డిజిటల్ 'మాయాజాలం'.. 

షేర్ చేయండి:
Ghaziabad Incident : చిన్నారుల ప్రాణాలు కబళిస్తున్న డిజిటల్ 'మాయాజాలం'.. 

సాక్షి లైఫ్ : స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అత్యవసరంగా మారింది. అయితే, ఇదే స్మార్ట్ ఫోన్ పసిపిల్లల పాలిట యమపాశంగా మారుతోందని గాజియా బాద్‌లో జరిగిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య ఉదంతం మరోసారి నిరూపించింది. కొరియన్ గేమ్‌లు, డ్రామాలు, టాస్క్-బేస్డ్ డిజిటల్ కంటెంట్‌కు బానిసలైన 12, 14, 16 ఏళ్ల మైనర్ బాలికలు 9వ అంతస్తు నుంచి దూకి తనువు చాలించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 'సారీ నాన్న.. మేము ఈ గేమ్‌ను వదలలేకపోతున్నాం' అంటూ వారు రాసిన సూసైడ్ నోట్ డిజిటల్ వ్యసనం ఎంత ప్రమాదకరమో చాటి చెబుతోంది.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

ఊహాలోకంలో..

కరోనా కాలంలో మొదలైన ఈ 'స్క్రీన్ టైం' కాలక్రమేణా పిల్లలలో వ్యసనంగా మారింది. ఇలాంటి చిన్నారులు కొరియన్ సంస్కృతికి ఎంతగా ప్రభావితమయ్యారంటే.. తమ పేర్లను, జీవనశైలిని కూడా అలాగే మార్చుకున్నారు.

డెత్ కమాండర్ టాస్క్..

ముగ్గురిలో ఒకరు 'డెత్ కమాండర్'గా మారి మిగతా ఇద్దరికీ టాస్క్‌లు ఇచ్చేవారని, ఈ క్రమంలోనే వారు చదువును, పాఠశాలను పూర్తిగా పక్కన పెట్టేశారని విచారణలో తేలింది. వాస్తవ ప్రపంచాన్ని మర్చిపోయి, ఆన్‌లైన్ గేమ్‌లలో వచ్చే బిట్‌కాయిన్ వంటి ఆశలకు లోనై పిల్లలు తప్పుడు మార్గాల్లోకి వెళ్తున్నారు.

పిల్లల మానసిక ఆరోగ్యంపై 'స్క్రీన్' దెబ్బ..

ఇంటర్నెట్ వాడకం వల్ల పిల్లల్లో శారీరక, మానసిక సమస్యలు తీవ్రమవుతున్నాయి. నిరంతరం మొబైల్ చూడటం వల్ల చదువుపై దృష్టి పెట్టలేకపోవడం. అర్థరాత్రి వరకు గేమ్‌లు ఆడటం వల్ల నిద్ర కరువై, చిరాకు, డిప్రెషన్ వంటివి తలెత్తుతున్నాయి. 

సైబర్ బుల్లీయింగ్..

ఆన్‌లైన్ వేదికలపై వేధింపులకు గురై ఆత్మవిశ్వాసం కోల్పోవడం. సామాజిక దూరం అంటే.. కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా ఏకాంతంగా గడపడం. డిజిటల్ మాధ్యమాల వల్ల కలిగే అనర్థాలను గుర్తించి అనేక దేశాలు కఠిన చట్టాలను అమలు చేస్తున్నాయి.

ఆస్ట్రేలియా, ఫిన్లాండ్లో 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం ఉంది.  ఫ్రాన్స్ లో కూడా పిల్లల డిజిటల్ భద్రత కోసం ప్రత్యేక చట్టంపై కసరత్తు చేస్తున్నారు.

భారతదేశంలో సుమారు ఒక బిలియన్ ఇంటర్నెట్ యూజర్లు ఉండగా, అందులో 75 శాతం మంది చిన్న పిల్లలు ఉండటం ఆందోళనకలిగిస్తోంది.

తల్లిదండ్రులు ఏం చేయాలి మరి..?  

నేటి ఆర్థిక ఒత్తిళ్లలో తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం తగ్గిపోయింది. కానీ, పిల్లలను ఈ రొంపి నుంచి బయటపడేయాలంటే కొన్ని  మార్పులు అవసరమని సైకాలజిస్టులు వెల్లడిస్తున్నారు.

 పిల్లలతో కబుర్లు చెబుతూ, వారికి నైతిక విలువలు, సంస్కృతి గురించి వివరించడానికి సమయం కేటాయించాలి.. మొబైల్‌కు బదులుగా శారీరక శ్రమ కలిగించే ఆటలు, పెయింటింగ్, పుస్తక పఠనం వంటి వాటిపై ఆసక్తి కలిగించాలి, క్రియేటివ్ యాక్టివిటీస్ వైపు మళ్లించాలి.

సామాజిక స్పృహ కల్పించాల్సిన బాధ్యత..

గదుల్లో పిల్లలు మొబైల్‌లో ఏం చూస్తున్నారో గమనిస్తూ ఉండాలి. ఫోన్ సెట్టింగ్స్‌లో 'పేరెంటల్ కంట్రోల్' ఉపయోగించాలి.  జీవితంలో గెలుపోటములు సహజమని, చిన్న చిన్న వైఫల్యాలకే కుంగిపోకూడదని వారికి ధైర్యం చెప్పాలి. పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్ పెట్టి వారు సురక్షితంగా ఉన్నారని భావించడం భ్రమే అవుతుంది. ముఖ్యంగా యాంత్రిక ప్రపంచం నుంచి పిల్లలను బయటకు తీసుకెళ్లి , సామాజిక స్పృహ కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై, పాఠశాలలపై ఎంతైనా ఉంది.

 

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.