Mental Stress : మెంటల్ స్ట్రెస్ కు 'అశ్వగంధ' సరైన ఔషధం..! తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు.. 

షేర్ చేయండి:
Mental Stress : మెంటల్ స్ట్రెస్ కు 'అశ్వగంధ' సరైన ఔషధం..! తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు.. 

సాక్షి లైఫ్ : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్య 'డిప్రెషన్'. ముఖ్యంగా కౌమార దశలో ఉన్నవారిలో ఇది అధికంగా కనిపిస్తోంది. దీని నివారణకు వాడే మందులు ఒక్కోసారి దుష్ప్రభావాలకు దారితీస్తుంటాయి. అయితే, మన ప్రాచీన ఆయుర్వేద మూలిక 'అశ్వగంధ' కుంగుబాటును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. టర్కీలోని మార్డిన్ ఆర్టుక్లు విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఈ కీలక విషయాలు వెల్లడయ్యాయి.

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

 

మెదడుపై ఒత్తిడి ప్రభావం.. 

తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల మెదడులో వాపు (Inflammation) ఏర్పడటమే కాకుండా, నరాల కణాలు దెబ్బతింటాయి. ఇది మెదడు పనితీరుకు అవసరమైన ప్రోటీన్ల స్థాయిని తగ్గించి, భావోద్వేగ సమస్యలకు కారణమవుతుంది. ఈ క్రమంలో అశ్వగంధలోని ఔషధ గుణాలు మెదడును ఎలా రక్షిస్తాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు.

యాంటీ డిప్రెసెంట్ మందులను..

పరిశోధకులు కొన్ని ఎలుకలకు 17 రోజుల పాటు ఆహారం సరిగ్గా ఇవ్వకుండా, అసౌకర్యమైన వాతావరణంలో ఉంచి వాటిలో కృత్రిమంగా కుంగుబాటు లక్షణాలను కలిగించారు. అనంతరం వాటిని వివిధ గ్రూపులుగా విభజించి.. కొన్నింటికి సాధారణ యాంటీ డిప్రెసెంట్ మందులను, మరికొన్నింటికి అశ్వగంధను ఇచ్చారు.

అశ్వగంధ ఇచ్చిన ఎలుకల్లో కుంగుబాటు లక్షణాలు గణనీయంగా తగ్గాయి. అవి ఉత్సాహంగా ఉండటమే కాకుండా, నిరాశ నిస్పృహల నుంచి త్వరగా కోలుకున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మెదడులోని ఫ్రంటో-పారియల్ కార్టెక్స్ (భావోద్వేగాలను నియంత్రించే భాగం) దెబ్బతినకుండా అశ్వగంధ అడ్డుకుంటున్నట్లు మైక్రోస్కోపిక్ పరీక్షల్లో తేలింది.

మందుల కంటే బెటర్ గా..

సాధారణంగా డిప్రెషన్ కోసం వాడే అలోపతి మందుల కంటే అశ్వగంధ మెరుగైన ఫలితాలను చూపినట్లు పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు మెదడులోని ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్స్ స్థాయిని అశ్వగంధ గణనీయంగా తగ్గించింది. మెదడు కణాలు చనిపోకుండా (Cell death) రక్షించడంలో ఇది కీలక పాత్ర పోషించింది. సాధారణంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆకలి తగ్గి బరువు తగ్గుతారు. కానీ అశ్వగంధ వాడిన ఎలుకల్లో బరువు తగ్గకుండా ఆరోగ్యంగా ఉండటం గమనార్హం.

అశ్వగంధలో ఉండే అడాప్టోజెనిక్ గుణాలు ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇస్తాయి. అయితే ఈ పరిశోధన ప్రస్తుతం జంతువులపైనే జరిగినందున, మనుషులు, ముఖ్యంగా యువత దీనిని వాడే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం అవసరమని పరిశోధక బృందం సూచిస్తోంది.

 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. ప్రీ-మెనోపాజ్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? అవేంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.