Chronic Pain Linked to Depression: దీర్ఘకాలిక నొప్పులతో 'డిప్రెషన్'..! : హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు..
సాక్షి లైఫ్ : మనం తరచుగా ఎదుర్కొనే చిన్నపాటి ఒళ్లు నొప్పులను 'అలసట వల్ల వచ్చినవే కదా' అని నిర్లక్ష్యం చేస్తుంటాం. అయితే, ఇలాంటి దీర్ఘకాలిక నొప్పులను (Chronic Pain) ఏళ్ల తరబడి పట్టించుకోకపోతే అవి కేవలం శారీరక ఇబ్బందులకే పరిమితం కాకుండా, మిమ్మల్ని మానసిక కుంగుబాటు (Depression) లోకి నెట్టే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
మెదడుపై నొప్పి ప్రభావం..
ప్రతిష్టాత్మక 'సైన్స్' జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం, దీర్ఘకాలిక నొప్పి మన మెదడులోని 'హిప్పోకాంపస్' (Hippocampus) అనే భాగంపై నేరుగా ప్రభావం చూపుతుంది. మెదడులో జ్ఞాపకశక్తికి కేంద్రంగా ఉండే ఈ భాగమే, నొప్పి పట్ల మన భావోద్వేగాలను కూడా నియంత్రిస్తుంది. నొప్పి ఎక్కువ కాలం కొనసాగినప్పుడు, హిప్పోకాంపస్‌లో వచ్చే మార్పులే వ్యక్తిని డిప్రెషన్ వైపు నడిపిస్తాయి.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
అధ్యయనంలో తేలిన ఆసక్తికర అంశాలు..
యూకే బయోబ్యాంక్ డేటా, మానవ మెదడు స్కాన్‌లను విశ్లేషించిన పరిశోధకులు కొన్ని కీలక విషయాలను గుర్తించారు. నొప్పితో బాధపడుతూ కూడా డిప్రెషన్‌కు గురికాని వారిలో హిప్పోకాంపస్ పరిమాణం పెరగడమే కాకుండా, దాని పనితీరు మెరుగ్గా ఉన్నట్లు తేలింది. నొప్పితో పాటు డిప్రెషన్ బారిన పడిన వారిలో హిప్పోకాంపస్ పరిమాణం తగ్గడం (కుంచించుకుపోవడం), కార్యాచరణ దెబ్బతినడం మరియు ఆలోచనా సామర్థ్యం (Cognitive abilities) క్షీణించడం గమనించారు. నొప్పి అనుభవించే ప్రతి ఒక్కరికీ డిప్రెషన్ రాదు. కాలక్రమేణా ఆ నొప్పికి మెదడు ఎలా స్పందిస్తుంది అనే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది.
ముందస్తు చికిత్సే మార్గం..
మెదడులో ఈ ప్రతికూల మార్పులు ఒక్కరోజులో సంభవించవు. నొప్పిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన కొద్దీ, ఇవి క్రమంగా అభివృద్ధి చెందుతాయి. అందుకే, దీర్ఘకాలిక నొప్పులను ప్రారంభ దశలోనే గుర్తించి, సరైన చికిత్స తీసుకోవడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
