సాక్షి లైఫ్ : డీప్ స్లీప్ దశలోనే మనిషి కలలు కంటాడు. సాధారణంగా తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయనే నమ్మకం ఉంది. కలలు ఎక్కువగా తెల్లవారుజామునే వస్తాయి. నిద్రావస్థ చరమ దశ తెల్లవారుజాము కాబట్టి, ప్రయత్నిస్తే ఆ సమయంలోని కలలను గుర్తు పెట్టుకునే అవకాశం ఉంది. కొందరికి అర్థరాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో మెలకువ వస్తే ఇక నిద్ర పట్టదు.
ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
నిద్ర ఫలితం..
మెలకువ ఉన్నప్పటికీ కళ్ళు మూసుకొని పడుకుంటే మెదడు చేతనావస్థలో ఉండి కూడా నిద్ర ఫలితం కొంతమేర దక్కుతుంది. నిద్రపట్టలేదు, మెలకువగానే ఉన్నామని అనుకున్నప్పటికీ, ఆ సమయంలో కూడా వచ్చిన కలలను గమనించే వీలు కలుగుతుంది.
కలలు..
నిద్రలో కలలు రావడం సాధారణమైన విషయం, అంతమాత్రాన నిద్ర సరిగ్గా పట్టడం లేదని ఆందోళన చెందనవసరం లేదు. సృజనాత్మకత ఎక్కువగా ఉన్నవారికి సహజంగా కలలు ఎక్కువగా వస్తాయి. భయం పుట్టే కలలు వచ్చినప్పుడు మాత్రం గుండె కొట్టుకునే వేగం, ఊపిరి పీల్చే వేగంలో మార్పులు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఇలాంటప్పుడు మెలకువ రావొచ్చు.
కలలు నిజమవుతాయనేది కేవలం అపోహ మాత్రమే..!
సాధారణంగా తెల్లవారుజామున ముందు రోజు చేసిన పనుల తాలూకు ఆలోచనలకు సంబంధించిన కలలే ఎక్కువగా వస్తాయి. కల ఎప్పుడో యాదృచ్ఛికంగా నిజం కావొచ్చు తప్ప, వేకువన వచ్చే కలలు నిజమవుతాయనేది కేవలం అపోహ మాత్రమే అని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
మానసిక నిపుణులు చెబుతున్నదేమిటంటే, కలలు ఎక్కువగా వేధిస్తున్నప్పుడు పగటిపూట సంతోషకరమైన అంశాలపై దృష్టి పెట్టాలి. కలలకు అంత ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతర విషయాలపైనే దృష్టి పెట్టాలని వారు సూచిస్తున్నారు.
నిద్రలోని కొన్ని దశల్లో భాగంగా మనస్సులో అసంకల్పితంగా సంభవించే ఆలోచనలు, భావోద్వేగాల అనుభూతులే కలలు. అంతేగానీ, అటువంటి వాటిని ఆధారంగా చేసుకొని ఇలా అయితే మంచి జరుగుతుందని, అలా అయితే చెడు జరుగుతుందని నిర్ధారించలేమని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com