Global Warning : న్యూరోసైన్స్, ఫార్మసీ, ఏఐ కలయికతో కొత్త ముప్పు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సైన్స్ ఫిక్షన్‌ సినిమాల్లో చూసే 'మెదడును మార్చే ఆయుధాలు' ఇకపై కల్పన మాత్రమే కాదని, అవి త్వరలోనే వాస్తవం రూపం దాల్చే ప్రమాదం ఉందని ప్రముఖ శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనిషి స్పృహ, జ్ఞాపకశక్తి, ప్రవర్తన లేదా ఆలోచనా సామర్థ్యాన్ని పూర్తిగా మార్చగల, లేదా దెబ్బతీయగల అత్యంత అత్యాధునిక సాంకేతికత సైన్యాలు, శత్రువుల చేతుల్లోకి చేరితే ప్రపంచ భద్రతకు పెనుముప్పుగా మారుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

  ఏంటి ఈ కొత్త ప్రమాదం అంటే..?

బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు బ్రిటీష్ పరిశోధకులు మైఖేల్ క్రౌలీ, మాల్కమ్ డాండో ఈ అంశంపై ఒక కీలక పుస్తకాన్ని ప్రచురించనున్నారు. సమగ్ర సాంకేతిక కలయిక అంటే..? న్యూరోసైన్స్, ఫార్మసీ, సెంట్రల్ నెర్వస్ సిస్టమ్‌పై పనిచేసే రసాయనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో వస్తున్న వేగవంతమైన పురోగతి కారణంగా ఈ ఆయుధాల తయారీ సాధ్యమవుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

మెదడు (Brain) ఇప్పుడొక కొత్త యుద్ధ క్షేత్రంగా మారే అవకాశం ఉంది.  అని నిపుణులు చెబుతున్నారు. మనిషి కేంద్ర నాడీ వ్యవస్థను (Central Nervous System) మభ్యపెట్టడానికి, గందరగోళానికి గురిచేయడానికి లేదా బలవంతంగా తమ నియంత్రణలోకి తీసుకోవడానికి అవసరమైన టూల్స్ మరింత కచ్చితత్వంతో, తేలికగా అందుబాటులోకి వస్తున్నాయి.

 పరిశోధనలే ఆధారం.. 

గతంలో కోల్డ్ వార్ సమయంలో అమెరికా, సోవియట్ యూనియన్ వంటి దేశాలు ఇలాంటి నాడీ వ్యవస్థపై పనిచేసే రసాయన ఆయుధాల (CNS-acting weapons) తయారీకి ప్రయత్నించాయి. ఇప్పుడు ఆ పరిశోధన, ఆధునిక సాంకేతికతతో మరింత ప్రమాదకరంగా మారింది. ఈ న్యూరో వెపన్ల ముఖ్య ఉద్దేశం.. ఒక వ్యక్తి ఆలోచనలను, నిర్ణయాలను, భావోద్వేగాలను మార్చడం. సైనికులను తమ నియంత్రణలోకి తీసుకోవడం లేదా పౌరుల్లో భయాందోళనలు సృష్టించడం దీని లక్ష్యంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.. 

అంతర్జాతీయ సంస్థలైన కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ (Chemical Weapons Convention - CWC) ను పర్యవేక్షించే కాన్ఫరెన్స్ ఆఫ్ ది స్టేట్స్ పార్టీస్‌లో ఈ ప్రమాదంపై శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ దేశాలు వెంటనే మేల్కొని, న్యూరోసైన్స్‌ను ఆయుధీకరణ చేయకుండా ఆపడానికి ,మానవ మెదడుకు రక్షణ కల్పించడానికి సమగ్ర అంతర్జాతీయ ఒప్పందాలను రూపొందించాలని పరిశోధకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.