నిద్ర మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మన ఆహారపు అలవాట్లు, నిద్ర మన శారీరక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, అదే విధంగా మన మానసిక ఆరోగ్యం కూడా చాలా ఎక్కువగా ప్రభావితమవుతుంది. నిద్ర మన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాదు ఒత్తిడి మరింతగా పెరిగి డిప్రెషన్ బారీన పడాల్సి వస్తుంది. దీని కారణంగా మానసిక సమస్యలు తలెత్తి జ్ఞాపక శక్తి తగ్గుతుందని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు.  

ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..? 

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?

నిద్ర-మానసిక ఆరోగ్యం.. కనెక్షన్.. 

సుదీర్ఘకాలం నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయని సైకియాట్రిస్ట్ లు వెల్లడిస్తున్నారు. ఇది పలు సమస్యలకు తగిన పరిష్కారాలకు సరైన నిర్ణయం తీసుకోలేకపోవడంపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. నిద్ర సరిపోకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది.   

అందుకే ముఖ్యం.. 

అటువంటి పరిస్థితులలో, మానసికంగా దృఢంగా ఉండటానికి, మానసిక స్థితి నియంత్రణకు ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం అని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది మెదడు పనితీరుకు మద్దతు ఇవ్వడం, రోజువారీ ఒత్తిడిని తొలగించడానికి ,మానసిక ప్రశాంతతను మెరుగుపరచడమేకాకుండా, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. తద్వారా మానసికంగా హెల్తీగా ఉండొచ్చు.   


నిద్ర ఎందుకు ముఖ్యం..?

మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నిద్ర అవసరమని వైద్యులు చెబుతున్నారు. మనం నిద్రపోతున్నప్పుడు, మన మెదడుకు జ్ఞాపకాలను నిల్వచేసుకోవడానికి, భావోద్వేగాలను ప్రాసెస్ చేయడానికి మరియు కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. నిద్ర లేకపోవడంఅనేది నిద్ర ఈ ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తుంది. దీని కారణంగా దేని మీద శ్రద్ధ పెట్టలేరు.

ఇది కూడా చదవండి..మానసిక ఆరోగ్యానికి, నిద్ర లేమికి లింక్ ఏంటి..?

ఇది కూడా చదవండి..యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు..?

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో జాక్‌ఫ్రూట్ ఎలా సహాయపడుతుంది..?

ఇది కూడా చదవండి..జాక్‌ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది..?

ఇది కూడా చదవండి..యాంటీబయాటిక్స్ ఎలా పని చేస్తాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.